చరణ్ కొత్త బ్యానర్ వెనక అసలు సీక్రెట్, ఆ డైరక్టర్ కోసమేనా?

Published : May 25, 2023, 01:56 PM IST
  చరణ్ కొత్త బ్యానర్ వెనక అసలు సీక్రెట్, ఆ డైరక్టర్ కోసమేనా?

సారాంశం

 రామ్ చరణ్, విక్రమ్ ఇద్దరూ డిస్ట్రిబ్యూషన్, మరికొన్ని సినిమాయేతర వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నారు. 


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కొత్త బ్యానర్ ను ప్రారంభించబోతున్నాడు. అదేమిటి ఆల్రెడీ రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా సినిమాలు చేస్తున్నారు తమ కొణిదెల ప్రొడక్షన్స్ పై . మళ్లీ వేరే బ్యానర్ ఎందుకు అనేది అందరిలో కలిగే ప్రశ్నే. అయితే యంగ్ పీపుల్  ను ప్రోత్సహించడంతోపాటు పాన్ ఇండియా సినిమాలను నిర్మించడానికి వీరిద్దరూ కొలాబరేట్ అయ్యారని చెప్తున్నారు. అక్కడున్నది రామ్ చరణా మరొకరా అనేది ప్రక్కన పెడితే సినిమా అనేది ఫక్తు వ్యాపారం. ఇక్కడ ఒకరని ఉద్దరించం, ప్రొత్సహించటం అనేవి సాధారణంగా ఉండవు. ఎదుటివారి ఆలోచనలపై పెట్టుబడి పెడితే కోట్లు వస్తాయనుకుంటే ముందుకు వస్తారు. 

ఇప్పుడు గ్లోబర్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది. ఆయన మాట్లాడే ప్రతీవిషయం నేషన్ మొత్తం వింటోంది. ఆయన నటించిన ఆర్ ఆర్ ఆర్ కు ఆస్కార్ వచ్చింది.  ఈ క్రమంలో రామ్ చరమ్ తో కొలాబిరేషన్ అంటే ఆ లెక్కలు వేరుగా ఉంటాయి. అందుకే తన చిరకాల మిత్రుడు #UVCreations విక్రమ్ తో  కలిసి ఓ కొత్త ప్రొడక్షన్ కంపెనీ పెట్టబోతున్నారు. వీరి బ్యానర్ కు 'యువి మెగా పిక్చర్స్' అనే పేరు పెట్టి అధికారికంగా ప్రకటించారు. ఈ బ్యానర్ నుంచి త్వరలోనే స్టార్ హీరోలు సినిమాలు రానున్నాయి. ప్రభాస్, రామ్ చరణ్, గోపీచంద్, శర్వానంద్, అనుష్క లాంటి స్టార్లు ఈ బ్యానర్ లో నటించబోతున్నారు. రామ్ చరణ్ కు ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో ఒక బ్యానర్ ఉన్నా దీనికి ఇచ్చే ప్రయారిటి దీనికి ఉంటుంది.
 
ఇప్పటికే రామ్ చరణ్, విక్రమ్ ఇద్దరూ డిస్ట్రిబ్యూషన్, మరికొన్ని సినిమాయేతర వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నారు. మరో ప్రక్క  రామ్ చరణ్ ..లోకేష్ కనకరాజ్ తో చేయబోయే సినిమాని యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తారు అన్నారు కదా. ఇప్పుడు ఈ కొత్త బ్యానర్ లో ఆ సినిమా వస్తుందని వినికిడి. రామ్ చరణ్ డేట్స్ పెట్టుబడిగా .యువి క్రియేషన్స్ మిగతా బడ్జెట్ పెట్టుకునేటట్లుగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రెండు బ్యానర్స్ కలిసి చేసే సినిమా కు లాభాల్లో వాటాలు పంచుకుంటారని చెప్తున్నారు. ఇది భారీ బడ్జెట్ సినిమా అని, అందుకే ఈ విధానం ఫాలో అవుతున్నట్లు చెప్పుకుంటున్నారు.

రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో రూపొందే  గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత చరణ్‌.. బుచ్చిబాబుతో సినిమా చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో ఈ చిత్రాన్ని వృద్ది సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ ఇయర్ ఎండింగ్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. శంకర్ తో మూవీ, బుచ్చిబాబుతో మూవీ కాకుండా.. కన్నడ డైరెక్టర్ నర్తన్ తో కూడా చరణ్ మూవీ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే.. అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. 
 

PREV
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం