తను చనిపోయానంటూ వచ్చిన వార్తలపై స్పందించిన కమెడియన్ సుధాకర్.. వైరల్ అవుతున్న వీడియో

By Asianet News  |  First Published May 25, 2023, 1:41 PM IST

టాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ సుధాకర్ చనిపోయారంటూ కొద్దిరోజులు వార్తలు సర్యులేట్ అవుతున్నాయి. వీటిపై ఓ వీడియో విడుదల చేస్తూ స్పందించారు. 
 


కొద్దిరోజులుగా సీనియర్ నటులు ఒక్కొక్కరుగా మరణిస్తున్న విషయం తెలిసిందే. ఉన్నట్టుండి అనారోగ్యాలతో ఆస్పత్రులకు వెళ్తున్నారు. వారం రోజుల్లోనే మ్యూజిక్ డైరెక్టర్ రాజ్,  సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో న్యూస్ కూడా నెట్టింట వైరల్ గా మారింది. టాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ సుధాకర్ (Comedian Sudhakar) అనారోగ్యం పాలైనట్టు, చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులకు ఆందోళన పడుతున్నారు. 

ఈ విషయం సుధాకర్ దాకా చేరడంతో ఆయనే స్వయంగా స్పందించారు. ఈ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేస్తూ తను క్షేమంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. నేను చాలా బాగున్నాను. ఆరోగ్యంగానూ ఉన్నాను. ఫేక్ న్యూస్ నమ్మొద్దు. నేను హ్యాపీగా ఉన్నారు. దయచేసి అవాస్తవాలను నమ్మకండి. క్షేమంగానే ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

Latest Videos

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటుడు, కమెడియన్ లో సుధాకర్ ఒకరు. తమిళ దర్శకుడు, నటుడు భారతీరాజా తెరకెక్కించిన ఓ సినిమాతో ఈయన వెండితెరకు పరిచయం అయ్యారు. నటుడిగా, కమెడియన్ గా, విలన్ గా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు ఆడియెన్స్  గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రొడ్యూసర్ గానూ పలు చిత్రాలను తెరకెక్కించారు. 90లలోనే ఆ సినిమాలు విడుదలయ్యాయి. అటు తమిళంలోనూ ఎన్నో చిత్రాల్లో నటించారు.

ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 1980 నుంచి ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్న ఆయన 2005 వరకు నిర్విరామంగా సినిమాలు చేశారు. ఆ తర్వాత 12 ఏళ్ల గ్యాప్ ఇచ్చి 2017లో ‘ఇ ఈ’ చిత్రంలో చివరిగా నటించారు. ఆపై సినిమాలకు దూరంగా ఉంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు సుధాకర్ అన్ని భాషల్లో కలిసి 600కు పైగా చిత్రాల్లో నటించారు. 

 

click me!