Konijeti Rosaiah Death: మాజీ సీఎం రోశయ్యతో బాలకృష్ణ...  వైరల్ గా త్రోబ్యాక్ పిక్

By team teluguFirst Published Dec 4, 2021, 12:51 PM IST
Highlights

సోషల్ మీడియాలో రోశయ్య, హీరో బాలకృష్ణ (Balakrishna) కలిసి ఉన్న ఫోటో వైరల్ గా మారింది. ఓ మూవీ వేడుకలో కొణిజేటి రోశయ్యకు బాలకృష్ణ షేక్ హ్యాండ్ ఇచ్చారు.

రాజకీయ నాయకుడిగా మాజీ సీఎం కొణిజేటి రోశయ్యది యాభై ఏళ్ల ప్రస్థానం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య హఠాన్మరణం అందరినీ కలచివేసింది. రాజకీయ కురువృద్ధుడిగా దశాబ్దాల పాటు ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన రోశయ్య సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అనేక కీలక పదవులు అలంకరించారు. ఆర్థికమంత్రిగా అత్యధిక పర్యాయాలు బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రికార్డు ఆయన సొంతం. పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్ గా రోశయ్య బాధ్యతలు నెరవేర్చారు. 88 ఏళ్ల రోశయ్య చాలా కాలంగా వృధ్యాప్య సంబంధింత రుగ్మతలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో నేడు ఉదయం కన్నుమూశారు. 


కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) మృతి రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఓ మహోన్నత నేత మరణం రాజకీయ, చిత్ర ప్రముఖులను దిగ్భ్రాంతికి గురిచేసింది. సోషల్ మీడియా వేదికగా లెజెండరీ పొలిటీషియన్ మృతికి ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో రోశయ్య, హీరో బాలకృష్ణ (Balakrishna) కలిసి ఉన్న ఫోటో వైరల్ గా మారింది. ఓ మూవీ వేడుకలో కొణిజేటి రోశయ్యకు బాలకృష్ణ షేక్ హ్యాండ్ ఇచ్చారు. పలకరింపుగా ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో సీనియర్ దర్శకులు దివంగత దాసరి నారాయణరావు ని మనం చూడవచ్చు. 

అలాగే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కొణిజేటి రోశయ్య మరణంపై స్పందించారు. కొణిజేటి రోశయ్య గారి మరణం రాజకీయాలలో ఓ అధ్యాయానికి ముగింపుగా అభివర్ణించారు. '' మాజీ గవర్నర్,మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి తీరని విషాదం. రాజకీయాలలో ఆయన భీష్మాచార్యులు వంటివారు.   ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేత రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడం లో ఓ రుషి మాదిరిగా సేవ చేశారు రోశయ్య కన్నుమూయడంతో రాజకీయాలలో ఓ శకం ముగిసింది  రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి నన్ను రాజకీయాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానించారువివాదరహితులుగా, నిష్కళింకితులుగా ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి రోశయ్య, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను....' అని  చిరంజీవి ట్వీట్ చేశారు.

Also read KONIJETI ROSAIAH DEATH:రాజకీయాలలో ఒక శకం ముగిసింది.. మాజీ సీఎం రోశయ్య మరణంపై చిరు దిగ్భ్రాంతి
ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరంజీవి రోశయ్యతో పాటు కలిసి పనిచేశారు. మరోవైపు బాలకృష్ణ ప్రత్యర్థి టీడీపీలో ఉన్నా... వివాదరహితమైన రోశయ్యతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. 

Also read Konijeti Rosaiah: సీఎంగా రోశయ్య చేసిన ఆ పనిని మెచ్చుకున్న కాంగ్రెస్ అధిష్టానం..

click me!