Mahesh babu: నా సినిమాల్లో ఆ సన్నివేశాలు పిల్లలకు నచ్చవు... సితార అయితే బయటికెళ్లిపోతుంది

By team teluguFirst Published Dec 4, 2021, 9:46 AM IST
Highlights

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన మహేష్ చిన్నతనంలోనే వెండితెరపై తన మార్కు చూపించాడు. తండ్రి కృష్ణతో కలిసి మహేష్ పలు హిట్ చిత్రాలు చేశారు. 

సూపర్ స్టార్ మహేష్ (Mahesh babu) తన తండ్రి కృష్ణ గారి లెగసీ ముందుకు తీసుకెళుతూ నిజమైన వారసుడిగా నిరూపించుకున్నారు. మహేష్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా ఉన్నారు. ఆయన సినిమాల మార్కెట్, ఫ్యాన్ బేస్ చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. నటుడిగా నాలుగు దశాబ్దాల అనుభవమున్న మహేష్.. హీరోగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన మహేష్ చిన్నతనంలోనే వెండితెరపై తన మార్కు చూపించాడు. తండ్రి కృష్ణతో కలిసి మహేష్ పలు హిట్ చిత్రాలు చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న మహేష్ ప్రధాన పాత్రలో కూడా సినిమాలు చేశారు. వాటిలో డ్యూయల్ రోల్స్ కూడా ఉన్నాయి. 


ఇన్నేళ్ల తన నట ప్రస్థానం గురించి మహేష్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారీ ఫ్యాన్ బేస్ కలిగిన కృష్ణ (Krishna) అబ్బాయి వెండితెరకు పరిచయం కావడం పెద్ద బాధ్యత. ఆయన అభిమానులను సంతృప్తి పరచడం నాకు పెద్ద ఛాలెంజ్... ఆ ఒత్తిడి నాకు ఉండేవి. అలాగే నాకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకోవాలి. ఇలాంటి ఛాలెంజ్ లు నేను కెరీర్ బిగినింగ్ లో ఎదుర్కొన్నాను. సమ్మర్ వెకేషన్ లో చైల్డ్ ఆర్టిస్ట్స్ గా సినిమాలు చేశాను. చదువు పూర్తి కాగానే నాన్న సినిమాలలోకి వచ్చేయ్ అని కోరారు.. అని మహేష్ తెలియజేశారు. 


ఇక తన కొత్త సినిమా విడుదలైన వెంటనే ఇద్దరు పిల్లలు, భార్యతో కూర్చొని ఇంట్లో చూస్తారట.నా సినిమాలు పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే భయం నాకుంది. నా సినిమాల్లో ఫైట్స్ వాళ్లకు అసలు నచ్చవు. ముఖ్యంగా సితార ఫైట్ సన్నివేశాలు రాగానే బయటికి వెళ్ళిపోతుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి నా సినిమాలు చూడడం నాకు గొప్ప అనుభూతి పంచుతుంది అంటూ.. మహేష్ తెలియజేశారు. 

Also read Mahesh babu: షాకింగ్ న్యూస్... మహేష్ బాబుకు సర్జరీ!
ప్రస్తుతం సర్కారు వారి పాట (Sarkaru vaari paata)షూట్ నుండి మహేష్ స్వల్ప విరామం తీసుకున్నారు. మోకాలి నొప్పితో బాధపడుతున్న మహేష్ సర్జరీ చేయించుకోనున్నారని, అందుకే ఆయన షూట్ కి బ్రేక్ ప్రకటించారని ప్రచారం జరుగుతుంది. గీత గోవిందం ఫేమ్ పరుశురాం సర్కారు వారి పాట చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా... తమన్ సంగీతం అందిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో సర్కారు వారి పాట విడుదల కానుంది. 

Also read Skylab review: స్కైలాబ్ మూవీ ప్రీమియర్స్ రివ్యూ
 

click me!