
హిట్, ప్లాఫ్ లకు అతీతంగా వరుస సినిమాలు చేస్తున్నాడు గోపీచంద్. రీసెంట్ గా రామబాణంతో పలకరించిన గోపీచంత్ తన తదుపరి చిత్రం పై పూర్తి దృష్టి పెట్టారు. తాజాగా గోపీచంద్ 31వ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాతో కన్నడ డైరెక్టర్ హర్ష టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రానికి భీమ అనే టైటిల్ ఫైనలైజ్ చేసారు.
కన్నడనాట శివరాజ్ కుమార్ తో బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించిన హర్ష.. ఇటీవల వేద సినిమాతో కూడా సూపర్ హిట్టుని అందుకున్నాడు. ఇప్పుడు ఈ మాస్ డైరెక్టర్ గోపీచంద్ తో జత కట్టడంతో ఈ మూవీ పై అంచనాలు క్రియేట్ చేస్తుంది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. గోపీచంద్ హీరోగా నటిస్తోన్న 31వ సినిమా ఇది. ఈ సినిమాకి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, జే స్వామి సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నాడు. గతంలో గోపీచంద్ పంతం సినిమా తెరకెక్కించిన శ్రీ సత్య సాయి ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీతో హిట్టు కొట్టాలని చూస్తున్నారు డైరెక్టర్ అండ్ హీరో.
ఇక గోపీచంద్ ప్రస్తుతం రామబాణం సినిమాలో నటించాడు. గతంలో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ తో కలిసి గోపీచంద్ చేసిన మూడో సినిమా ఇది. ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.