#Salaar నార్త్ లో బ్రేక్ ఈవెన్ అవుతుందా? 'పుష్ప' ని బీట్ చేయగలదా?

Published : Dec 30, 2023, 01:19 PM ISTUpdated : Dec 30, 2023, 01:20 PM IST
 #Salaar నార్త్ లో బ్రేక్ ఈవెన్ అవుతుందా? 'పుష్ప' ని బీట్ చేయగలదా?

సారాంశం

నార్త్ లో ప్రభాస్ కు భారీ ఫ్యాన్ బేస్ ఉందన్న విషయం తెల్సిందే దానికి తోడు సలార్ కు పాజిటివ్ టాక్ రావడంతో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.


 సలార్(Salaar Movie) తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ ఉండగా  హిందీలో కూడా సాలిడ్ కలెక్షన్స్ తో కుమ్మేయడం ఖాయమని అంతా భావించారు, కానీ అక్కడ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)డంకి(Dunki Movie) వలన థియేటర్స్ ఏమాత్రం అనుకున్న స్దాయిలో దొరకలేదు, ప్రతీ 100 థియేటర్స్ లో 65 డంకికి కేటాయిస్తే  35 మాత్రమే సలార్ కి వెళ్ళాయి. దాంతో కలెక్షన్స్ పై ఇంపాక్ట్ గట్టిగానే పడింది.  ఈ క్రమంలో హిందీ వెర్షన్ రైట్స్ ఎంతకు కొన్నారు..బ్రేక్ ఈవెన్ అవుతుందా అనే సందేహాలు మొదలయ్యాయి.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు   #Salaar హిందీ డబ్బింగ్ రైట్స్ ని 120 కోట్లు పెట్టి తీసుకున్నారు. అంటే బ్రేక్ ఈవెన్ రావాలంటే 130 కోట్లు అయినా గ్రాస్ రావాలి. అయితే ఇప్పటిదాకా గ్రాస్ 109 కోట్లు నెట్ 93 కోట్లు వచ్చిందని ఓ అంచనా. హిందీ బెల్ట్ లో ఊహించని విధంగా డ్రాప్ స్టార్టైంది. ఫస్ట్ వీక్ లో థియేటర్స్ సరపడా ఉంటే రికార్డ్ స్దాయి ఓపినింగ్స్ కు ఈ పాటికి బ్రేక్ ఈవెన్ అయ్యిపోయేది. 

కానీ వన్ వీక్ లో ఊపు తగ్గటంతో ఇప్పుడు ఎప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతుందా అని ఎదురుచూడాల్సిన సిట్యువేషన్ అని తెలుస్తోంది.  అక్కడ భారీగా వర్కవుట్ కాకపోవటానికి మరో కారణం అల్లు అర్జున్ పుష్పలాగా రొమాన్స్, హిట్ సాంగ్స్  లేకపోవటమే అంటున్నారు. పుష్ప చిత్రం నార్త్ ఇండియాలో 150 దాకా వసూలు చేసిందని ఆ రికార్డ్ పదిలింగానే ఉందని చెప్తున్నారు. ప్రభాస్ సాహో అక్కడ బాగానే వర్కవుట్ అయ్యినా ఆదిపురుష్ దెబ్బ కూడా భారీగానే ఉందని చెప్తున్నారు. 
 
మరో ప్రక్క    #Salaar తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. తొలిరోజే రూ.178 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ వీకెండ్ పూర్తి కాకముందే రూ.500 కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.  కొద్దిగా డ్రాప్ అయ్యినా , ఈ వీక్ లో డెవిల్ తప్ప చెప్పుకోదగ్గ సినిమా లేకపోవటంతో ఎదురేలేకుండా దూసుకుపోతోంది. 
 
‘కేజీయఫ్‌’లో నరాచీ ప్రపంచాన్ని చూపించిన ప్రశాంత్‌ నీల్‌.. ‘సలార్‌’తో ఖాన్సార్‌ వరల్డ్‌ని పరిచయం చేసారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధశత్రువులుగా మారడమే ఈ సినిమా కథాంశం.  దేవ- వరదరాజ మన్నార్‌ శత్రువులుగా మారడానికి కారణమేంటి?అని ఉత్సాహంగా చర్చించుకుంటూ థియేటర్స్ కు జనం వెళ్తున్నారు.. అసలు ఖాన్సార్‌ కథేంటి? అనేది  డిస్కషన్ గా మారింది. 

ప్రభాస్  పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హసన్ కీలక పాత్రలు పోషించిన   సలార్ సినిమా తొలి భాగం ‘సలార్- సీజ్ ఫైర్’తెలుగు భాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. ఫస్ట్ పార్ట్ చూసి  రెండో భాగం ‘శౌర్యాంగ పర్వం’ఎప్పుడూ అని అడుగుతున్నారు. అయితే ఇది ప్యాన్ ఇండియా సినిమా. కేవలం తెలుగు మార్కెట్ మాత్రమే కాదు ...హిందీ, కన్నడ, మళయాళ,తమిళ మార్కెట్ లలో కూడా అక్కడ భాషల్లోకి డబ్బింగ్ అయ్యి భారీగా రిలీజ్ అయ్యింది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది