Nagarjuna : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున దంపతులు.. శుభాకాంక్షలు తెలిపిన నాగ్

Published : Dec 30, 2023, 01:02 PM IST
Nagarjuna :  సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున దంపతులు.. శుభాకాంక్షలు తెలిపిన నాగ్

సారాంశం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి CM Revanth Reddyని సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అక్కినేని నాగార్జున కలిసి బొకే అందించారు. 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి Revanth Reddy పాలనపై దృష్టి సారించారు. ప్రతి శాఖలపైనా రివ్యూ మీటింగ్ లు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. పలు సూచనలు, ఆదేశాలతో మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తున్నారు. డిసెంబర్ 7న సీఎంగా రేవంత్ రెడ్డి ఎల్డీస్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi స్వయంగా రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత సీఎంతో భేటీ అయ్యారు. ఇండస్ట్రీలోని పలు అంశాలపై చర్చించారు. ఇక తాజాగా అక్కినేని నాగార్జున Akkineni Nagarjuna  సతీమణి అమలా అక్కినేనితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం నివాసానికి వెళ్లి బొకే అందించి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు విషయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. 

ఇండస్ట్రీ నుంచి మరికొందరు ప్రముఖులు అల్లు అరవింద్ వంటి పెద్దలు త్వరలో రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీలోని పలు అంశాలపై సీఎంకు విన్నవించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి నంది అవార్డులపైనా స్పందించారు. త్వరలోనే అవార్డుల ప్రదానోత్సవంపై స్పష్టత రానుంది.  

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sivakarthikeyan: హీరోలు ఒకరి తర్వాత ఒకరు..దుబాయ్ మోజు వెనుక ఇదే కారణం!
Amla Paul: కొడుకుతో క్యూట్ ఫోటోలని షేర్ చేసిన అమలాపాల్.. నెటిజన్ల విమర్శలు