#Devil ఓపినింగ్స్ కు దెబ్బ ఆ కామెంట్ ఎఫెక్టేనా?

Published : Dec 30, 2023, 01:01 PM IST
 #Devil ఓపినింగ్స్  కు దెబ్బ ఆ కామెంట్ ఎఫెక్టేనా?

సారాంశం

'డెవిల్'కు మొదటి రోజు అటు ఇటుగా రూ. 2 కోట్లు వచ్చాయని ట్రేడ్ అంటోంది. అలా తగ్గిపోవటానికి కారణం ఏమిటి...అంటే.... 


నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ మూవీ ‘డెవిల్’. అభిషేక్ నామా దర్శక, నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా, మాళవిక నాయర్ ముఖ్య పాత్రలో కనిపించింది. డెవిల్ నిన్న శుక్రవారం ( డిసెంబర్ 29న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఓపినింగ్స్ మాత్రం అనుకున్న స్దాయిలో రాబట్టలేదు.  'అమిగోస్'కు వచ్చిన ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది.

'బింబిసార' కు మొదటి రోజు సుమారు 10 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి.   'అమిగోస్'కు ఎక్సపెక్టేషన్స్ లేకపోయినా సరే మొదటి రోజు రూ. 3 కోట్లు కలెక్ట్ చేసింది.ఇప్పుడు  'డెవిల్' సినిమా ట్రైలర్ క్లిక్ అవ్వడంతో మంచి అంచనాలు ఉన్నాయి. కానీ, థియేటర్లలో జనాలు మాత్రం చెప్పుకోదగిన స్దాయిలో లేరు. 'డెవిల్'కు మొదటి రోజు అటు ఇటుగా రూ. 2 కోట్లు వచ్చాయని ట్రేడ్ అంటోంది. అలా తగ్గిపోవటానికి కారణం ఏమిటి...అంటే.... నందమూరి, టీడీపీ అభిమానుల సపోర్ట్ లేకపోవటమే అంటున్నారు!

డెవిల్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో రాజకీయాలపై ఓ ప్రశ్న కళ్యాణ్ రామ్ కు ఎదురైంది. అందుకు  కళ్యాణ్ రామ్ చెప్పిన సమాధానమే కలెక్షన్స్ డ్రాప్ కు కారణమంటూ ప్రచారం జరుగుతోంది. ఆప్రశ్న... ఆంధ్రాలో 2024లో జరగబోయే ఎన్నికల్లో మీ స్టాండ్ ఎటువైపు అని ప్రశ్నించగా... తాతయ్య నందమూరి తారక రామారావు స్థాపించిన ''తెలుగు దేశం పార్టీకి'' అని స్పష్టంగా కళ్యాణ్ రామ్ జవాబు ఇవ్వకపోవటమే అంటున్నారు. కుటుంబమంతా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని, అది తీసుకున్నప్పుడు తెలియజేస్తానని చెప్పారు.  కుటుంబ నిర్ణయం అంటే కళ్యాణ్ రామ్, ఆయన సోదరుడు జానియర్ ఎన్టీఆర్ మాత్రమే మాట్లాడుకోవటం అంటున్నారు.  

మరో ప్రక్క డెవిల్ కి పాజిటివ్ టాక్ వస్తుండటంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ సెలబ్రేషన్స్ లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. డెవిల్ 2 సినిమా కచ్చితంగా ఉంటుంది. ఇదే టీంతో ఉంటుంది. 2024లో డెవిల్ 2 సినిమా మొదలుపెట్టి 2025లో రిలీజ్ చేస్తాం. ఈ సినిమా షూట్ మొదలైన 10 రోజులకే శ్రీకాంత్ పార్ట్ 2 కథ కూడా చెప్పాడు. సీక్రెట్ సర్వీస్ తో కథని ముందుకి తీసుకెళ్లొచ్చు. ఆ లైన్ నాకు బాగా నచ్చింది. డెవిల్ 2 సినిమా 1940 సమయంలో ఉంటుంది. అలాగే 2000 సమయంలో కూడా ఉంటుంది. రెండు కాలాలకు సంబంధించి కథ సాగుతుంది అని చెప్పుకొచ్చారు. 
  

PREV
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది