The Warriorr Trailer: ది వారియర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో టెన్షన్ వాతావరణం... పొడిపొడిగా ముగించిన రామ్! 

Published : Jul 01, 2022, 10:23 PM IST
The Warriorr Trailer: ది వారియర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో టెన్షన్ వాతావరణం... పొడిపొడిగా ముగించిన రామ్! 

సారాంశం

రామ్ లేటెస్ట్ మూవీ వారియర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనంతపురంలో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి భారీ రెస్పాన్స్ దక్కింది. వేలల్లో అభిమానులు హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో కొంత టెన్షన్ వాతావరణం నెలకొనగా... హీరో రామ్ పొడిపొడిగా ముగించారు. 

బాలయ్య అభిమానులు అధికంగా ఉండే అనంతపురంలో ది వారియర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్(The Warriorr Trailer) జరిగింది. ఈ వేడుకకు భారీగా జనాలు తరలివచ్చారు. సెలబ్రిటీలను చూడడానికి ఎగబడ్డారు. సరిపడా భద్రతా సిబ్బంది లేకపోవడం వలన వేదిక వద్ద యువతను కంట్రోల్ చేయడం కష్టమైంది. కొందరు వేదికపైకి కూడా వెళ్లారు. మైక్, సౌండ్ సిస్టమ్స్ వద్దకు యువకులు చేరుకోవడం వలన ఇబ్బందులు ఏర్పడ్డాయి. చివరికి కొందరు వేదికపైకి రాళ్లు విసిరారు. ఈ విషయాన్ని యాంకర్ శ్యామల స్వయంగా తెలియజేశారు. 

తెలియకుండానే ది వారియర్ టీమ్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. త్వరగా ముగించడమే మంచిదని నిర్ణయించుకున్నారు. నటుడు ఆది నుండి వరుసగా కృతి శెట్టి(Krithi Shetty), దర్శకుడు లింగుస్వామి, అతిథి బోయపాటి చాలా తక్కువ మాట్లాడారు. హీరో రామ్ సైతం పొడిపొడిగా ముగించారు. ఆయన కేవలం దర్శకుడు గురించే రెండు మాటలు ఎక్కువ మాట్లాడారు. రామ్ మాట్లాడుతూ... లింగు స్వామి గారు చాలా జెన్యూన్ డైరెక్టర్, ఈ మూవీలో సన్నివేశాలన్నీ ఆయన జెన్యూన్ థాట్స్ నుండి పుట్టినవే. తెలుగు మాస్ చిత్రాల్లో చాలా సన్నివేశాలకు లింగు స్వామి గత చిత్రాల్లోని సీన్స్ స్ఫూర్తి, చాలా మంది దర్శకులు ఈ విషయం నాకు చెప్పారు. 

ఇక దేవిశ్రీ ఇవాళ రాలేదు. ఐ మిస్ యు బ్రదర్, అన్నారు. ఇక విలన్ రోల్ చేసిన ఆది గురించి ప్రస్తావిస్తూ... ఆయన ఎక్కడని అడిగారు. వెళ్లిపోయారని చెప్పగా... రామ్ నవ్వుతూ మీ దెబ్బకు అందరూ భయపడి పారిపోతున్నారు. ఆయన నవ్వుతూ చెప్పినా అక్కడ పరిస్థితి అలానే ఉన్నట్లుంది. జులై 14న ది వారియర్ విడుదల అవుతుంది. అందరూ తప్పక చూడాలని చెప్పి రామ్ ముగించాడు. నిర్మాతల గురించి కానీ, గెస్ట్ బోయపాటి గురించి కానీ ఆయన పెద్దగా మాట్లాడలేదు. మొత్తంగా ది వారియర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హడావిడిగా ముగిసింది. 

ది వారియర్ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. రామ్ పోతినేని (Ram Pothineni)పవర్ ఫుల్ పోలీస్ రోల్ చేస్తున్నారు. కాగా త్వరలో రామ్-బోయపాటి శ్రీను పాన్ ఇండియా మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. అఖండ హిట్ తో ఫార్మ్ లో ఉన్న బోయపాటి నుండి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా