The Warriorr Trailer: అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ తో వస్తున్న రామ్ 

Published : Jul 01, 2022, 09:37 PM IST
The Warriorr Trailer: అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ తో వస్తున్న రామ్ 

సారాంశం

మాస్ చిత్రాల దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ పోతినినే హీరోగా తెరకెక్కిన ది వారియర్ విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ విడుదల చేశారు.

రన్, పందెంకోడి చిత్రాలతో భారీ ఇమేజ్ తెచ్చుకున్నారు దర్శకుడు లింగు స్వామి. కెరీర్ లో సక్సెస్లు ఉన్నా చాలా నెమ్మదిగా చిత్రాలు చేస్తారు. ఇరవై ఏళ్ల కాలంలో లింగు స్వామి చేసింది 9 చిత్రాలు మాత్రమే. పదవ చిత్రంగా ది వారియర్ తెరకెక్కించారు. టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో వారియర్ రూపొందించారు. నేడు ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ వేడుక అనంతపురంలో ఘనంగా జరిగింది. వేలాది మంది అభిమానులు హాజరు కాగా.. బోయపాటి శ్రీను ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరోయిన్ కృతి శెట్టి(Krithi Shetty)తో పాటు నటుడు ఆది పినిశెట్టి హాజరు కావడం జరిగింది. 

ఇక ట్రైలర్ (The Warriorr Trailer)పరిశీలిస్తే రూత్ లెస్, క్రేజీ పోలీస్ ఆఫీసర్ గా రామ్ కనిపిస్తుండగా కర్నూలును గడగడలాడించే గురు పాత్ర ఆది చేస్తున్నారు. రామ్(Ram Pothineni), ఆది మధ్య నడిచే ఆధిపత్య పోరే ది వారియర్ చిత్రంగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. దర్శకుడు లింగు స్వామి తన మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు. నటి నదియా హీరో రామ్ తల్లి పాత్ర చేస్తున్నారు. వారియర్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. 

ది వారియర్ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించగా... బుల్లెట్ సాంగ్ విశేష ఆదరణ దక్కించుకుంది. జులై 14న వారియర్ తెలుగు , తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన రామ్... రెడ్ మూవీ పరాజయంతో డీలా పడ్డారు. ది వారియర్ మూవీపై ఆయన భారీ ఆశలు పెట్టుకున్నారు. రామ్ తన నెక్స్ట్ మూవీ దర్శకుడు బోయపాటి శ్రీనుతో ప్రకటించారు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కిస్తున్నారు. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. 
 

PREV
click me!

Recommended Stories

హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?