God Father First Look: గెట్ రెడీ మెగా ఫ్యాన్స్....  గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది!

Published : Jul 01, 2022, 09:00 PM IST
God Father First Look: గెట్ రెడీ మెగా ఫ్యాన్స్....  గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది!

సారాంశం

చిరంజీవి అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో గాడ్ ఫాదర్ పై భారీ అంచనాలున్నాయి. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుండగా దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చారు యూనిట్.

 
కెరీర్ లో చిరంజీవి(Chiranjeevi) పొలిటికల్ థ్రిల్లర్స్ చేసింది తక్కువ. ఆయన మలయాళ చిత్రం లూసిఫర్ పై మనసు పారేసుకున్నారు. మోహన్ లాల్ పాత్ర చేయాలని డిసైడ్ అయ్యాడు. రీమేక్ హక్కులు కొని గాడ్ ఫాదర్ గా తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న గాడ్ ఫాదర్ చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. ఈ క్రమంలో గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ (God Father First Look)కి ముహూర్తం ఫిక్స్ చేశారు. జులై 4న సాయంత్రం 5;45 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేయడం జరిగింది.

సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక నయనతార చిరంజీవి చెల్లెలి పాత్ర చేయడం . కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తుండగా... థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ పై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. ఆచార్య మూవీతో చేదు అనుభవాన్ని చవిచూసిన చిరంజీవి గాడ్ ఫాదర్ తో కమ్ కావాలనుకుంటున్నారు. 

 మరోవైపు చిరంజీవి హీరోగా  భోళా శంకర్, మెగా 154 చిత్రాలు తెరకెక్కుతున్నాయి. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ తమిళ్ హిట్ మూవీ వేదాళం అధికారిక రీమేక్ కాగా, దర్శకుడు బాబీ మెగా 154 అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్ర టైటిల్ గా వాల్తేరు వీరయ్య పరిశీలనలో ఉంది.  
 

PREV
click me!

Recommended Stories

హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?