
మా ఎన్నికలు (Maa Elections) ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల తొలి ఫలితం వచ్చేసింది. దీనిలో భాగంగా ప్రకాష్ రాజ్ (prakash raj panel) ప్యానెల్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా పోటీ చేసిన శివా రెడ్డి, (shiva reddy) కౌశిక్ రెడ్డి (koushik reddy), సురేష్ కొండేటి (suresh kondeti) విజయం సాధించినట్లు ఎన్నికల అధికారుల తెలిపారు. అలాగే ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌లోని 8 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ముందంజలో వున్నారు.
మొదటి ఫలితం తమకు అనుకూలంగా రావడంతో ప్రకాష్ ప్యానెల్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విష్ణు ప్యానెల్ నుండి 10 మంది లీడ్ లో ఉన్నారని సమాచారం అందినప్పటికీ, మొదటి ఫలితం ప్రకాష్ రాజ్ కి అనుకూలంగా వచ్చింది. అత్యధిక మెజారిటీతో శివారెడ్డి గెలుపొందినట్లు తెలుస్తుంది. అలాగే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి పోటీ చేసిన జబర్దస్త్ యాంకర్ అనసూయ (anasuya) సైతం లీడ్ లో ఉన్నట్లు సమాచారం అందుతుంది. మా ఎన్నికలలో మంచు విష్ణు గెలవడం ఖాయం అని ఫిలింనగర్‌లో చర్చలు జరుగుతున్నప్పటికీ ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి అభ్యర్థులు గెలుపొందడం ఉత్కంఠ రేపుతోంది.
ALso Read:MAA elections:ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి ముగ్గురు విజయం
కాగా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ సందర్భంగా 665 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి వీటి సంఖ్య 700 దాటి వుంటుందని అంచనా. గతంలోనే ఎన్నడూ లేని విధంగా 83 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అంతకుముందు ఊహించిన దాని కంటే ఎక్కువగా సభ్యులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోటెత్తడంతో ముందుగా ఇచ్చిన పోలింగ్ గడువు సరిపోదని మా ఎన్నికల అధికారులు నిర్థారించారు. దీంతో మా అధ్యక్ష అభ్యర్ధులు ప్రకాశ్ రాజ్ (prakash raj), మంచు విష్ణులతో (manchu vishnu) చర్చించిన ఎన్నికల అధికారులు పోలింగ్ సమయం మరో గంట పెంచాలని నిర్ణయించారు.
దీంతో మా ఎన్నికల పోలింగ్ 3 గంటల వరకు జరిగింది. క్యూలైన్‌లో వున్నవారికి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. పోటీలో నిలిచిన ఇరు ప్యానెల్స్ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తమ ప్యానెల్ విజయం సాధిస్తుంది అంటూ.. ధీమాగా చెబుతున్నారు. ఇంత హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో విజేత ఎవరనేది మరి కొన్ని గంటలలో తేలిపోనుంది.