MAA elections:ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి అనసూయ విజయం!

Published : Oct 10, 2021, 07:30 PM IST
MAA elections:ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి అనసూయ విజయం!

సారాంశం

ఎన్నికల సరళి ఆధారం చేసుకొని మంచు విష్ణు విజయం సాధిస్తారని అందరు భావించారు. మంచు విష్ణు సైతం సాయంత్రం మాదే విజయం అన్నట్లు మీడియా ముందు విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఫలితాలు మాత్రం తారుమారుగా ఉన్నాయి. 

యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ కూడా విజయం సాధించారు. మొదటిసారి మా ఎన్నికలలో పాల్గొన్న అనసూయ మా ఎగ్జిక్యూటివ్  మెంబర్ గా గెలిచారు. తొలి ఫలితం ప్రకాష్ రాజ్ కి అనుకూలంగా రావడంతో విజయం ఎవరిది అవుతుందనే ఉత్కంఠ కొనసాగుతుంది.  ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి శివా రెడ్డి, కౌశిక్, సురేష్ కొండేటి గెలిచినట్లు సమాచారం. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి నాలుగవ మెంబర్ గా అనసూయ గెలిచినట్లు సమాచారం. 

మా ఎన్నికలను రెండు వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విజయం కోసం తీవ్రంగా కృషి చేశారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. టాలీవుడ్ నటుల గౌరవాన్ని బజారుకు ఈడ్చారన్న వాదనలు వినిపించాయి. 

ఇక ప్రకాష్ రాజ్, మంచు విష్ణులలో అధ్యక్షులు ఎవరు కానున్నారని ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రాధమికంగా మంచు విష్ణుదే విజయం అంటూ కొన్ని మీడియా వర్గాలు ధ్రువీకరించాయి. ఎన్నికల సరళి ఆధారం చేసుకొని మంచు విష్ణు విజయం సాధిస్తారని అందరు భావించారు. మంచు విష్ణు సైతం సాయంత్రం మాదే విజయం అన్నట్లు మీడియా ముందు విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఫలితాలు మాత్రం తారుమారుగా ఉన్నాయి. 

మరి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ విషయంలోనే ఇలాంటి ఫలితాలా? లేక అధ్యక్షుడు, మైన్ ప్యానెల్ సభ్యుల విషయంలో కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయా వస్తాయా అనేది చూడాల్సి ఉంది. మరో కొన్ని నిమిషాలలో పూర్తి ఫలితాలు రానున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

Karan Johar: ఆలియా, షారుఖ్ ఖాన్ లని అన్ ఫాలో చేసిన కరణ్ జోహార్.. ఇద్దరితో గొడవలా ?
Ram Charan Peddi: పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే