మహేష్ బాబు ఇంటి కోసం రూ.5 కోట్ల ఖర్చు.. అసలు మ్యాటర్ ఏంటి ?

Published : Sep 24, 2021, 03:27 PM IST
మహేష్ బాబు ఇంటి కోసం రూ.5 కోట్ల ఖర్చు.. అసలు మ్యాటర్ ఏంటి ?

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్నాడు. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్నాడు. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ కి జోడిగా కీర్తి సురేష్ ఈ చిత్రంలో నటిస్తోంది. పోకిరి తర్వాత అంతటి మాస్ హంగామా ఈ చిత్రంలో ఉండబోతున్నట్లు టాక్. 

సర్కారు వారి పాట చిత్రం ముగియగానే మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. అప్పుడే ఈ చిత్రాన్ని ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభమై పోయింది. మహేష్ నెక్స్ట్ మూవీ రాజమౌళి దర్శకత్వంలో ఉండాల్సి ఉంది. కానీ ఆర్ఆర్ఆర్ ఆలస్యం అవుతున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ అయ్యాక కూడా జక్కన్న కథ కోసం గ్యాప్ తీసుకుంటాడు. ఈ లోగా త్రివిక్రమ్ చిత్రాన్ని ఫినిష్ చేయాలని మహేష్ డిసైడ్ అయ్యాడు. 

తాజా సమాచారం మేరకు మహేష్, త్రివిక్రమ్ మూవీ కోసం ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. రూ 5 కోట్ల ఖర్చుతో ప్రకాష్ ఓ ఇంటి సెట్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని కీలక సన్నివేశాలని త్రివిక్రమ్ ఇక్కడే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 

త్రివిక్రమ్ సినిమా అంటే ఇంటి సెట్ కామన్ గా ఉంటుంది. అతడు, అల వైకుంఠపురములో, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల్లో ఇంటి సెట్స్ ఆకట్టుకుంటాయి. కగతంలో త్రివిక్రమ్, మహేష్ కాంబోలో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. ఈ సారి త్రివిక్రమ్ మహేష్ కోసం లైట్ గా ఫ్యామిలీ టచ్ ఉండే హై ఓల్టేజ్ యాక్షన్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ హ్యాట్రిక్ కాంబోకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: హౌస్ నుంచి ఝాన్సీ అవుట్, అమాయకత్వంతో ఉండలేను అంటూ కన్నీళ్లు.. త్రిగుణ్ పై వర్షిణి కుట్ర
Keerthy Suresh: ఫ్లైట్‌లో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. భర్త ఆంటోనీ ఎంట్రీతో సీన్ రివర్స్!