'మహా సముద్రం' ట్రైలర్ 'RX 10000'లా ఉంది.. ఇంకా పచ్చిగా చెప్పాలంటే.. వర్మ హాట్ కామెంట్స్

pratap reddy   | Asianet News
Published : Sep 24, 2021, 11:05 AM IST
'మహా సముద్రం' ట్రైలర్ 'RX 10000'లా ఉంది.. ఇంకా పచ్చిగా చెప్పాలంటే.. వర్మ హాట్ కామెంట్స్

సారాంశం

ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మహా సముద్రం'(Maha Samudram). అజయ్ భూపతి ఈసారి బలమైన పాత్రలతో ఎమోషనల్ కథని చూపించబోతున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది.

ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మహా సముద్రం'(Maha Samudram). అజయ్ భూపతి ఈసారి బలమైన పాత్రలతో ఎమోషనల్ కథని చూపించబోతున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది. శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు, అను ఇమ్మానుయేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

రావు రమేష్ , జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపిస్తున్నాడు. గురువారం విడుదలైన ట్రైలర్ కు విశేష స్పందన వస్తోంది. ఆర్ఎక్స్ 100 తరహాలో బోల్డ్ రొమాన్స్ ఉన్నప్పటికీ బలమైన కథ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ లో డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. 

మహా సముద్రం ట్రైలర్ విడుదల కాగానే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. అజయ్ భూపతి వర్మకు శిష్యుడే. గతంలో అజయ్ భూపతి వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. 

మహా సముద్రం ట్రైలర్ గురించి వర్మ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ' హేయ్ అజయ్ భూపతి.. మహాసముద్రం ట్రైలర్ ఆర్ఎక్స్ 10000లా ఉంది.. ఇంకా పచ్చిగా చెప్పాలంటే దానమ్మా మొగుడులా ఉంది.. ఆల్ ది బెస్ట్' అని వర్మ హాట్ కామెంట్స్ చేశాడు. 

సుంకర రామబ్రహ్మం ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 14న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ట్రైలర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. 

 

PREV
click me!

Recommended Stories

నన్ను చూసి ఉలిక్కిపడి చస్తుంటారు, అఖండ 2 బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో బాలకృష్ణ ఆవేశం..6వ హిట్ రాబోతోంది
Illu Illalu Pillalu Today Episode Dec 15: తాగేసి రచ్చ రచ్చ చేసిన వల్లీ, ఇచ్చిపడేసిన ప్రేమ