షాకింగ్.. రూ.400 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన నిర్మాత.. ఆయన ధైర్యానికి హ్యాట్సాఫ్

By telugu teamFirst Published Sep 24, 2021, 12:54 PM IST
Highlights

కరోనా పరిస్థితుల వల్ల చిత్ర పరిశ్రమ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోందో అందరికి తెలిసిందే. అయితే ఓటిటి వల్ల కొందరు నిర్మాతలు గట్టెక్కగలుగుతున్నారు.

కరోనా పరిస్థితుల వల్ల చిత్ర పరిశ్రమ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోందో అందరికి తెలిసిందే. అయితే ఓటిటి వల్ల కొందరు నిర్మాతలు గట్టెక్కగలుగుతున్నారు. కరోనా, థియేటర్స్ సమస్యలు, ఓటిటి ఎఫెక్ట్.. బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు, సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలకు పెను శాపంగా మారాయి. 

ఇలాంటి పరిస్థితుల్లో వీలున్న నిర్మాతలు తమ చిత్రాలని రేట్ చూసుకుని ఓటీటీకి అమ్మేస్తున్నారు. తిరిగి పరిస్థితులు ఎప్పుడు నార్మల్ అవుతాయా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో భారీ చిత్రాల భవిష్యత్తు థియేటర్స్ పైనే ఆధారపడి ఉంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 

ఏకంగా 400 కోట్ల ఆఫర్ ని ఆయన రిజెక్ట్ చేయడంతో అంతా షాక్ కి గురవుతున్నారు. ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్న యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి నాలుగు చిత్రాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఇందులో షంషీరా, పృథ్విరాజ్ భారీ బడ్జెట్ చిత్రాలు కాగా.. బంటి ఔర్ బాబీ 2, జయేష్ భాయ్ జోర్దార్ మీడియం బడ్జెట్ చిత్రాలు. ఈ నాలుగు చిత్రాలపై మంచి అంచనాలు ఉన్నాయి. 

కరోనా కారణంగా ఈ చిత్రాల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. దిగ్గజ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ కళ్ళు చెదిరే ఆఫర్ తో ఆదిత్య చోప్రాని సంప్రదించిందట. ఈ నాలుగు చిత్రాల ఓటిటి రిలీజ్ కు 400 కోట్లు ఆఫర్ చేసిందట. కానీ ఆదిత్య చోప్రా మాత్రం అమెజాన్ ఆఫర్ ని తృణప్రాయంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. 

పరిస్థితులు నార్మల్ అయ్యాక తన చిత్రాలని థియేటర్స్ లోనే విడుదల చేయాలని ఆదిత్య చోప్రా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ న్యూస్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆదిత్య చోప్రా లాంటి అగ్ర నిర్మాతలు లాంటి నిర్ణయాలు తీసుకుంటే థియేటర్ వ్యవస్థ నిలబడుతుందని అంటున్నారు. కాస్త ఆలస్యమైతే పరిస్థితి ఏంటి అని భయపడుతూ నిర్మాతలు తమ చిత్రాలని ఓటిటి అమ్మేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదిత్య చోప్రా ధైర్యానికి ప్రశంసలు దక్కుతున్నాయి.  

click me!