Kgf Release: కెజియఫ్ రిలీజ్ అయ్యి మూడేళ్లు.. ఛాప్టర్ 2 గురించి ఏమన్నారంటే..

Published : Dec 21, 2021, 01:46 PM ISTUpdated : Dec 21, 2021, 01:50 PM IST
Kgf Release: కెజియఫ్ రిలీజ్ అయ్యి మూడేళ్లు.. ఛాప్టర్ 2 గురించి  ఏమన్నారంటే..

సారాంశం

సైలెంట్ గ వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది కెజియఫ్ మూవీ. దాదాపు 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈమూవీ రిలీజ్ అయ్యి మూడేళ్లు అయ్యింది.ఈసదర్భంగా మెమోరీస్ ను పంచుకున్నారు మూవీ టీమ్. ఛాప్టర్ 2 రిలీజ్ ఎప్పుడో మరోసారి గుర్తు చేశారు.

ఒక యంగ్ స్టార్.. ఒక భాషకే పరిమితం అయిన చిన్న హీరో.. యష్.(Yash) కన్నడ సినిమాలు తప్పించి ఇతర ఇండస్ట్రీలతో టచ్ కూడా లేని హీరోను... ఒకేఒక్క సినిమా పాన్ ఇండియా స్టార్ ను చేసింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్.. యష్ సూపర్ పెర్ఫామెంట్స్ కలుపుకుని కెజియఫ్(Kgf) రూపంలో అద్భతమైన సినిమా పాన్ ఇండియాను అలరించింది. ఈసినిమా రిలీజ్ అయ్యి నేటికి(డిసెంబర్ 21) మూడేళ్లు గడిచింది. ఈ సందర్భగా కెజియఫ్ టీమ్ గుర్తు చేసుకున్నారు.

బంగారం గనులకు సంబంధించిన కథకు.. పొలిటికల్ లింక్స్ జోడించి.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) కెజియఫ్ ను అద్భుతంగా రూపొందించారు. హోంబెళే ఫిల్మ్ నిర్మించి ఈ సినిమా.. 2018 డిసెంబర్ 21 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మొదట ఈసినిమా ఎవరికి అర్ధం కాలేదు. పట్టించుకోలేదు. కాని ఆతరువాత స్లోగా ఆడియ్స్ కు కెజియఫ్ ఎక్కేసింది. చిన్నగా కలెక్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ప్రశాంత్ నీల్ టేకింగ్, యష్ యాక్టింగ్ కు సపోర్ట్ గా మ్యూజిక్ చింపేసింది. యష్ ఎలివేషన్ సీన్స్, తల్లి సెంటిమెంట్ సీస్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ సన్నీవేశాలప్పుడు వచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఒళ్లు గగుడ్పొడిచేలా ఉంటుంది. ఇలా కెజియఫ్ హిట్ కు ఇన్ని కారణాలు ఉన్నాయి.

ఇక కెజియఫ్(Kgf) సినిమా రిలీజ్ అయ్యి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా.. మూవీ టీమ్ పండగ చేసుకుంది. సోషయల్ మీడియాలో విష్ చేసుకోవడం తో పాటు.. ఆనాటి షూటింగ్ మెమోరీస్ ను గుర్తు చేసుకుంటూ… ఓ చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశార టీమ్. అంతే కాదు త్వరలో రిలీజ్ కాబోతుంన్న కెజియఫ్ ఛాప్టర్ 2 సినిమా విషయాన్ని కూడా గుర్తు చేశారు. కెజియఫ్ 2 ఎట్టిపరిస్థితుల్లో ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుందంటూ మరో సారి అనౌన్స్ చేశారు టీమ్.

 

కెజియఫ్ ఫస్ట్ మూవీ ఇచ్చిన కిక్ తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కెజియఫ్ ఛాప్టర్ 2ను అద్భుతంగా తీర్చి దిద్దారు. పాన్ ఇండియా మార్కెట్ ను ద్రుష్టిలో పెట్టుకుని అన్ని విషయల్లో జాగ్రత్త పడ్డారు టీమ్. యష్ క్యారెక్టర్ కు ధీటుగా పవర్ ఫుల్ అధీరా పాత్రకోసం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్(Sanjay Dath) ను తీసుకున్నారు. ఆయన లుక్ రిలీజ్ చేసి.. సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశారు. అటు ఆడియన్స్ కూడా  కెజియఫ్ ఛాప్టర్ 2 గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Also Read : Naga Shourya Experiment: మరో ప్రయోగం చేయబోతన్న యంగ్ హీరో నాగశౌర్య

కెజియఫ్ ఛాప్టర్ 2 కి సంబంధించి ఇప్పటి వరకూ వచ్చిన అప్ డేట్స్ కు మంచి రెస్పాస్ వచ్చింది. ఎక్కువగా పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేసిన కెజియఫ్ టీమ్.. రీసెంట్ గా యష్  ఇంట్రెడక్షన్ తో టీజర్ ను రిలీజ్ చేశారు. పవర్ ఫుల్ ప్యాక్ గన్ షాట్ సీన్ తో.. సినిమాపై ఇంట్రెష్ట్ ను పెంచారు. అటు ప్రశాంత్ నీల్ కూడా కెజియఫ్ సినిమాతో ఇమేజ్ అమాంతం పెంచుకున్నారు. తెలుగులో వరుసగా స్టార్ హీరోల సినిమాల  ఆఫర్స్ సాధించాడు. ప్రభాస్(Prabhas) తో సలార్ మూవీ చేస్తున్న ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్(Ntr), అల్లు అర్జన్(Allu Arjun) తో సినిమాలు చేయబోతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌