మహేష్ 'మహర్షి' టీజర్ కి 2 మిలియన్ వ్యూస్!

Published : Aug 09, 2018, 05:47 PM IST
మహేష్ 'మహర్షి' టీజర్ కి 2 మిలియన్ వ్యూస్!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని ఈరోజు మహేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని ఈరోజు మహేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం. విడుదలైన కొద్దీ గంటల్లోనే ఈ సినిమా 2 మిలియన్ వ్యూస్ సాధించి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.

మీసం, గడ్డం సరికొత్త లుక్ తో మహేష్ అలా నడుచుకుంటూ వస్తోన్న ఈ టీజర్ కి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటికే డెహ్రాడూన్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది.

వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ బాబు రిషి అనే పాత్రలో కనిపిస్తుండగా అల్లరి నరేష్ రవి అనే మరో కీలక పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Chiru - Mohan Babu: మోహన్ బాబు అరిచి చెప్పింది ఈ సూపర్ హిట్ గురించే.. మురళి మోహన్ నిర్ణయంతో చిరంజీవి ఎంట్రీ
Madhuri Dixit: స్టార్‌డమ్ వదిలేసి భర్త కోసం సాధారణ గృహిణిగా మారిన ఎవర్‌గ్రీన్‌ హీరోయిన్‌.. ఆమె అమెరికా రహస్యాలు