'నీది నాది ఒకే కథ'కు అరుదైన గౌరవం!

First Published Aug 9, 2018, 4:55 PM IST
Highlights

ప్రతి ఏడాది జరిగే డిసి సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్(DCSAFF) లో సౌత్ ఏషియన్ కంట్రీస్ లో కొన్ని సినిమాలను సెలెక్ట్ చేసి వాటిని ఈ ఫిలిం ఫెస్టివల్ లో స్క్రీన్ చేస్తుంటారు. ఈ ఫిలిం ఫెస్టివల్ లో సెలెక్ట్ అయ్యే తెలుగు సినిమాలు చాలా అరుదు. ఇప్పుడు ఆ గౌరవాన్ని దక్కించుకుంది 'నీది నాదే ఒకే కథ' సినిమా.

ప్రతి ఏడాది జరిగే డిసి సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్(DCSAFF) లో సౌత్ ఏషియన్ కంట్రీస్ లో కొన్ని సినిమాలను సెలెక్ట్ చేసి వాటిని ఈ ఫిలిం ఫెస్టివల్ లో స్క్రీన్ చేస్తుంటారు. ఈ ఫిలిం ఫెస్టివల్ లో సెలెక్ట్ అయ్యే తెలుగు సినిమాలు చాలా అరుదు. ఇప్పుడు ఆ గౌరవాన్ని దక్కించుకుంది 'నీది నాదే ఒకే కథ' సినిమా. వేణు ఊడుగుల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీవిష్ణు హీరోగా నటించాడు.

సాత్నా టైటస్ హీరోయిన్ గా కనిపించారు. పిల్లలను తమకిష్టమైన రంగంలో ప్రోత్సహించకుండా.. ఇంజనీర్ లేదా డాక్టర్ చేయాలని బలవంతంగా వారిపై తమ ఆశలను రుద్దే తల్లితండ్రులకు ఈ సినిమా ఒక లెసన్ అనే చెప్పాలి. తనకు నచ్చిన రంగంలో రాణించడానికి ఇంట్లో వారి సపోర్ట్ లేని ఓ మిడిల్ క్లాస్ కుర్రాడి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ సినిమానే ఇప్పుడు ఫిలిం ఫెస్టివల్ ప్రదర్శిస్తుండడం విశేషం. ఈ ఈవెంట్ వచ్చే నెల 7 నుండి 9 వరకు జరగనుంది.  

  

click me!