#Balakrishna:బాలయ్య, బోయపాటి చిత్రం లేటెస్ట్ అప్డేట్

Published : Feb 21, 2024, 03:08 PM IST
 #Balakrishna:బాలయ్య, బోయపాటి చిత్రం లేటెస్ట్ అప్డేట్

సారాంశం

. మాస్ యాక్షన్ తో పాటు పొలిటికల్ టచ్ ఉండే ఈ కథను బాలయ్య కి వినిపించారట.  వెంటనే ఓకే చెప్పిన బాలయ్య షూట్ కు రెడీ అవుతున్నారట.  

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్‌, అఖండ బాక్సాఫీస్‌ వద్ద ట్రెండ్‌ సెట్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ కాంబో అంటే అందరికీ ఆసక్తి. అలాగే బోయపాటి సైతం బాలయ్యతో కాకుండా వేరే హీరోతో సినిమా చేస్తే వర్కవుట్ కావటం లేదు. ఈ నేపధ్యంలో ఈ కాంబినేషన్ కు మళ్లీ రంగం సిద్దమైందని సమాచారం. 

బోయపాటి మొదటి నుంచీ కూడా యాక్షన్ .. ఎమోషన్ ను సమపాళ్లలో కలుపుకునే కథలను రెడీ చేసుకుంటూ వెళుతున్నాడు. ఆయన సినిమాల్లో మాస్ ఆడియన్స్ కి కావలసిన అంశాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన వాళ్ల నుంచి ఆయన సినిమాలకు ఎక్కువ ఆదరణ లభిస్తూ ఉంటుంది.  ఆ మధ్యన  రామ్ తో చేసిన సినిమా చేస్తున్న సమయంలోనే బాలయ్య  కోసం బోయపాటి ఒక పవర్ఫుల్ స్టోరీని రెడీ చేశాడట. మాస్ యాక్షన్ తో పాటు పొలిటికల్ టచ్ ఉండే ఈ కథను బాలయ్య కి వినిపించారట.  వెంటనే ఓకే చెప్పిన బాలయ్య షూట్ కు రెడీ అవుతున్నారట.

అందుతున్న సమాచారం మేరకు...14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు.రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది.  రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సబ్జెక్ట్ పై మంచి నమ్మకంతో ఉన్నారట. గతంలో ఈ నిర్మాతలు దూకుడు, సరిలేరు నీకెవ్వరూ, నేనొక్కడినే వంటి సినిమాల చేసారు. శర్వానంద్ తో చేసిన శ్రీకారం చిత్రం వర్కవుట్ కాకపోవటంతో స్లో అయ్యారు. అప్పటినుంచి ఓ పెద్ద ప్రాజెక్టు కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికి సెట్ అయ్యింది.

బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో BB4 మూవీ చేస్తే అది అఖండ 2 అవుతుంద‌నే వార్త‌లు వచ్చాయి. అయితే అదేమీ కాదని అంటున్నారు.  అయితే 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌లోనూ లెజెండ్ 2 ఉంటుంద‌ని సినీ వర్గాల్లో వినపడుతోంది. అయితే  కొత్త కథాంశంతో ఫ్రాంచైజీగా చేస్తారేమో చూడాలి. ఇంట్రస్టింగ్ విషయమేమంటే.. బోయపాటి ఇప్పటి వరకు బాలకృష్ణతో చేసిన సినిమాలన్నింటిలోనూ ఆయన్ని ద్విపాత్రాభినయంలోనే చూపించారు. మరి ఈ కొత్త ప్రాజెక్టులోనూ దాన్ని కంటిన్యూ చేస్తారో లేదో మరి. 
 

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?