యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ హ్యాపీ డేస్ చిత్రంతో నూనూగు మీసాల కుర్రాడిగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ప్రస్తుతం నిఖిల్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న హీరో. నిఖిల్ కూడా పాన్ ఇండియా స్టార్ అని చెప్పేయొచ్చు.
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ హ్యాపీ డేస్ చిత్రంతో నూనూగు మీసాల కుర్రాడిగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ప్రస్తుతం నిఖిల్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న హీరో. నిఖిల్ కూడా పాన్ ఇండియా స్టార్ అని చెప్పేయొచ్చు. కార్తికేయ 2 చిత్రంతో నిఖిల్ కి పాన్ ఇండియా గుర్తింపు లభించింది. ప్రస్తుతం నిఖిల్ ఇండియా హౌస్, స్వయంభు ఇలా రెండు పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు.
తాజాగా నిఖిల్ కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది. అందుకు కారణం ఉంది. ఈ యంగ్ హీరో తండ్రిగా ప్రమోషన్ పొందాడు. నిఖిల్ భార్య పల్లవి బుధవారం రోజు పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. నిఖిల్ తన కొడుకుని ఎంతో ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుని ముద్దాడుతున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నారు. నిఖిల్ తండ్రిగా ప్రమోట్ కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ 18 పేజెస్, స్పై రెండు చిత్రాల్లో నటించారు. అయితే ఆ రెండు చిత్రాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు.
ప్రస్తుతం నిఖిల్ ఫోకస్ స్వయంభు, ఇండియా హౌస్ చిత్రాలపై ఉంది. నిఖిల్, పల్లవి 2020లో ప్రేమించుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీళ్లిద్దరి ప్రేమకి ప్రతిరూపంగా బిడ్డ జన్మించింది. నిఖిల్ సతీమణి పల్లవి డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.