
కమల్ హాసన్.. నటనకు వికీపీడియా లాంటి వారు. ఆయన ఇండియన్ బెస్ట్ యాక్టర్స్ లో టాప్‌లో ఉంటారు. అందుకే ఆయన్ని నటనలో లోక నాయకుడు అంటారు. కోలీవుడ్‌ని కొన్నేళ్లపాటు శాషించిన హీరో. ఆర్ట్ ని, కమర్షియల్ అంశాలను బ్లెండ్ చేసి సినిమాలు చేసి హిట్ కొట్టిన ఘనత ఆయన ఒక్కడికే దక్కుతుంది. అందుకే అటు ప్రయోగాలు, ఇటు కమర్షియల్ హిట్లు చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పటికీ అదే క్రేజ్ రేంజ్‌తో రాణిస్తున్నారు.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ సినిమాకి కేరాఫ్. తెలుగు సినిమాకి కమర్షియాలిటీని పరిచయం చేసి, సినిమాలకు థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపించిన నటుడు. హీరోయిజాన్ని, నటనను మిక్స్ చేసి మెప్పించడం ఆయన ప్రత్యేకత. కేవలం నటనతోనే కాదు డాన్సులతోనూ తెలుగు ఆడియెన్స్ ని ఉర్రూతలూగించారు. ఆ తర్వాత ఎంత మంది వచ్చినా అదే క్రేజ్‌తో రాణిస్తున్నారు. మెగాస్టార్‌గా నిలిచారు.
అయితే చిరంజీవిపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి తలుచుకుంటే కోలీవుడ్ లో కూడా పెద్ద స్టార్ అయ్యేవాడట. ఆయన చెబుతూ, `చిరంజీవి తలుచుకుంటే తమిళంలో కూడా ఈజీగా పెద్ద స్టార్ అయ్యేవాడు. కానీ ఆ సమయంలో ఆయన కోలీవుడ్‌పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు` అని పేర్కొన్నారు కమల్.
అయితే కమల్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారడం విశేషం. మెగా అభిమానులు వాటిని ఇప్పుడు షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. కమల్ హాసన్ వంటి పెద్ద నటుడు మెగాస్టార్ గురించి గొప్పగా మాట్లాడంతో వాళ్లంతా ఖుషి అవుతున్నారు. అది చిరంజీవి రేంజ్ అని కామెంట్ చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. `బింబిసార` ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సోషియో ఫాంటసీ ఎలిమెంట్లతో ఈ మూవీ తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని విడుదల చేయబోతున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. మరోవైపు కమల్ హాసన్ `ఇండియన్ 2`, `కల్కి`, `థగ్` వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
Read more: చిరంజీవి నాకు ఎలాంటి సాయం చేయలేదు.. నటి లయ షాకింగ్ కామెంట్స్.. పారితోషికం ఇవ్వకుండా ఎగ్గొట్టారు..