గబ్బర్ సింగ్ కి పదేళ్లు... బండ్ల-హరీష్ శత్రుత్వం వీడి మిత్రులయ్యారు! 

By Sambi ReddyFirst Published May 12, 2022, 12:35 PM IST
Highlights

దర్శకుడు హరీష్ శంకర్ కి ఖరీదైన రిస్ట్ వాచ్ బహుమతిగా ఇచ్చాడు నిర్మాత నటుడు బండ్ల గణేష్. సదరు వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో పాటు హరీష్ పై అభిమానం కురిపించారు.
 

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కెరీర్ లో గబ్బర్ సింగ్ కి ప్రత్యేక స్థానం ఉంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రికార్డు అందుకున్న గబ్బర్ సింగ్ 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది. హిందీ చిత్రం దబంగ్ రీమేక్ గా గబ్బర్ సింగ్ చిత్రాన్ని హరీష్ తెరకెక్కించారు. మాతృకకు చాలా మార్పులు చేసి దాదాపు స్ట్రెయిట్ మూవీగా గబ్బర్ సింగ్ రూపొందించారు. పవన్ కళ్యాణ్ మాస్ మేనరిజం సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని పవన్ భక్తుడు బండ్ల గణేష్ నిర్మించిన విషయం తెలిసిందే. 

2012 మే 11న విడుదలైన గబ్బర్ సింగ్ 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బండ్ల గణేష్ కొన్ని ఎమోషనల్ ట్వీట్స్ చేశారు. హీరో పవన్ కళ్యాణ్ పై భక్తి కురిపించాడు. అదే సమయంలో గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ కి ఓ బహుమతి అందించారు. ఖరీదైన రిస్ట్ వాచ్ బహుమతిగా ఇచ్చి అభిమానం చాటుకున్నారు. ఇక బండ్ల గణేష్ తనకు బహుమతి ఇవ్వడం పట్ల హరీష్ స్పందించారు.నాకు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన నిర్మాత బండ్ల గణేష్ కి ధన్యవాదాలు అంటూ తెలిపారు. నీ సహకారం లేకపోతే గబ్బర్ సింగ్ అంత త్వరగా అయ్యేది కాదంటూ కృతజ్ఞతలు తెలిపాడు.

Thank you for the surprise my BlockBuster Producer thanks again for ur extraordinary support in making GabbarSingh … ur always special to me… 🙏🙏🙏
Nivvu lekapothe antha fast ga movie ayyedhi kaadhu … love u for ur passion ; https://t.co/3ZkWmjZNDY pic.twitter.com/5ju6zYT0u4

— Harish Shankar .S (@harish2you)

అయితే ఇదే మూవీ విషయమై గతంలో బండ్ల గణేష్(Bandla Ganesh), హరీష్ శంకర్ గొడవపడ్డారు. గబ్బర్ సింగ్ యానివర్సరీ నేపథ్యంలో చిత్ర యూనిట్ అందరికీ కృతజ్ఞతలు తెలిపిన హరీష్ శంకర్ నిర్మాత బండ్ల గణేష్ పేరు ప్రస్తావించలేదు. దీనికి హర్ట్ అయిన బండ్ల గణేష్ పరోక్షంగా హరీష్ పై సెటైర్లు వేశాడు. హరీష్ కూడా తగ్గకుండా కౌంటర్లు వేయడం జరిగింది. ఇద్దరి మధ్య ట్విట్టర్ వార్ జరుగగా.. మెల్లగా చల్లబడ్డారు. 10వ యానివర్సరీకి మాత్రం బండ్ల గణేష్ దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar)కి బహుమతి ఇవ్వడం, హరీష్ కృతజ్ఞతలు తెలపడం ఆసక్తికరంగా మారింది. 

click me!