డైరెక్టర్ శంకర్ ను మెప్పించే పనిలో థమన్.. ‘ఆర్సీ15’ కోసం స్పెషల్ ఎఫర్ట్

By team teluguFirst Published May 12, 2022, 11:06 AM IST
Highlights

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ప్రతి పెద్ద సినిమాకు ఆయనే ట్రెండీ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ‘ఆర్సీ15’పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 
 

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), క్రియేటివ్ డైరెక్టర్ శంకర్  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్సీ15’.హీరోయిన్ గా కియారా అద్వానీ (Kiara Advani) నటిస్తోంది.  భారీ బడ్జెట్ తో ఈ పొటిటికల్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు శంకర్. గతేడాది ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఒక్కో షెడ్యూల్ పూర్తి చేస్తూ వస్తున్నారు చిత్ర యూనిట్. అయితే ఈ మూవీకి సెన్సేషనల్ డైరెక్టర్ థమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ RC15 మ్యూజిక్ ట్రాక్స్ పై పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 

చాలా సందర్భాల్లో థమన్ డైరెక్టర్ శంకర్ గురించి గొప్ప చెప్పాడు. ఆయన తన జీవితానికి మెంటర్ అని కూడా తెలియజేశాడు. రీసెంట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గని’ ఆడియో లాంచ్ లోనూ శంకర్ పై ఉన్న అభిమానాన్ని వ్యక్త పరిచాడు. అయితే తొలిసారిగా శంకర్ తో కలిసి పనిచేసే అవకాశం రావడంతో హిట్ సాంగ్స్ ను అందించేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలిపారు థమన్. సినిమాలో ఆరు సాంగ్స్ ఉంటాయని, అన్నీ తప్పకుండా ఆడియెన్స్ కు నచ్చుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం టాప్ టెక్నీషియన్స్ తో మ్యూజిక్ కంపోజింగ్ చేస్తున్నట్టు వెల్లడించారు.  

అయితే ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రెండు సాంగ్స్ ను పూర్తి చేశామని, వాటి చిత్రీకరణ కూడా పూర్తైయిందని అప్డేట్ ఇచ్చారు. ఇంకా నాలుగు సాంగ్స్ చిత్రీకరించాల్సి ఉందని తెలిపారు. అయితే మిగితా సాంగ్స్ షూటింగ్ కోసం హెవీ కంప్యూటర్ గ్రాఫిక్స్, తనదైన శైలి టెక్నిక్స్ తో షూట్ చేయనున్నట్టు వివరించారు.  తనవంతు ప్రయత్నంగా ప్రతి సాంగ్ టాప్ లో ఉండేలా కంపోజ్ చేస్తున్నామని తెలిపారు. దీంతో సంగీత ప్రియులకు త్వరలో ‘ఆర్సీ15’ నుంచి ట్రెండీ మ్యూజిక్ అందనుంది.

ఇక థమన్ గతేడాది నుంచి వరుసగా హిట్ సాంగ్స్ ను అందిస్తున్నారు. మాస్ హహారాజ రవితేజ నటిచిన ‘క్రాక్’ నుంచి మాస్, క్లాస్ సాంగ్స్ తో దుమ్ములేపుతున్నాడు. అలాగే బాలక్రిష్ణ ‘అఖండ’కు కూడా అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. అంతకు ముందు ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’, ‘గని’, ఈ రోజు రిలీజ్ అయినా ‘సర్కారు వారి పాట’కు కూడా క్యాచీ ట్యూన్ అందించారు. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్, విజయ్66, ఆర్సీ15’కు వర్క్ చేస్తున్నారు. 

click me!