Sarkaru Vaari Paata:మహేష్ ని టార్గెట్ చేసిన మెగా ఫ్యాన్స్... ఇదో చెడు వ్యసనం!

By Sambi ReddyFirst Published May 12, 2022, 9:59 AM IST
Highlights


సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఫ్యాన్ వార్స్ ఎక్కువైపోయాయి. స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య అనారోగ్య పూరిత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఒక హీరో సినిమా దెబ్బ తీయాలని మరొక హీరో ఫ్యాన్స్ శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. 

సర్కారు వారి పాట చిత్రాన్ని మెగా హీరోల అభిమానులు టార్గెట్ చేశారు. అసలు షో పడిందో లేదో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. నేడు మహేష్ సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) విడుదలవుతుండగా యూఎస్ లో అర్ధరాత్రే ప్రీమియర్స్ ప్రదర్శన మొదలైంది. షో మొదలైన నిమిషాల వ్యవధిలో మెగా హీరోలైన అల్లు అర్జున్, చరణ్, పవన్ (Pawan Kalyan)ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. సినిమా రాడ్, ఇంట్రో అసలు బాగోలేదు. చెత్త సినిమా అంటూ ట్వీట్స్ వేయడం మొదలుపెట్టారు. అసలు ఫస్ట్ హాఫ్ కూడా పూర్తి కాకుండానే సినిమా ప్లాప్ అంటూ కామెంట్స్ చేశారు. 

ఇక మెగా హీరోల దాడిని తిప్పికొట్టడానికి మహేష్ (Mahesh Babu)ఫ్యాన్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. చరణ్, అల్లు అర్జున్, పవన్ ఫ్యాన్స్ నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు, మీరు పట్టించుకోవద్దు, సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ట్వీట్స్ స్టార్ట్ చేశారు. అటు మెగా ఫ్యాన్స్ ఇటు మహేష్ ఫ్యాన్స్ ట్వీట్స్ యుద్దానికి దిగారు. సర్కారు వారి పాట చిత్రాన్ని దెబ్బతీయాలని వారు, కాపాడుకోవడం కోసం వీరు సోషల్ మీడియాలో యజ్ఞం మొదలుపెట్టారు. 

గతంలో చాలా మంది నెటిజెన్స్ ఈ సోషల్ మీడియా రివ్యూస్ ఆధారంగా ఓ సినిమాకు వెళ్లాలా వద్దా అని డిసైడ్ చేసేవారు. ఫ్యాన్ వార్స్ కారణంగా చిత్ర ఫలితంతో సంబంధం లేకుండా ఫేక్ రివ్యూస్ ప్రచారం ఎక్కువైపోవడంతో వారు నమ్మడం మానేశారు. అయితే ఎంతో కొంత మేర నెగిటివ్ ప్రచారం చిత్ర విజయంపై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్... అదే విధంగా మెగా హీరోల సినిమాలు విడుదలైనప్పుడు వాళ్ళ యాంటీ ఫ్యాన్స్ ఇదే చేస్తున్నారు. స్టార్ హీరోల అభిమానులకు ఇది నిత్యకృత్యం అయిపోతుంది. 

సినిమా బాగుంటే దాన్ని ఎవరూ ఆపలేరు. బాగోకపోతే ఎన్ని జాకీలేసి లేపినా ఆడదు. దానికి ఆచార్య ఫలితమే నిదర్శనం. ఇద్దరు స్టార్ హీరోల నటించిన ఆచార్య రెండో రోజే చతికలపడింది. టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక సర్కారు వారి ఫలితం ఏమిటనేది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. అప్పటి వరకు వేచి చూడడం బెటర్. ఇక రివ్యూస్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమాలున్నాయి. అదే సమయంలో గొప్ప రివ్యూస్ తెచ్చుకొని నష్టాలు మిగిల్చిన చిత్రాలు కూడా ఉన్నాయి. 

click me!