ఇండియన్ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డ్!

By Udaya DFirst Published Feb 25, 2019, 11:06 AM IST
Highlights

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో 91వ ఆస్కార్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో మన భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి అవార్డు దక్కింది. 

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో 91వ ఆస్కార్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో మన భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి అవార్డు దక్కింది. ప్రముఖ నిర్మాత గునీత్ మోంగా నిర్మించిన 'పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్' అనే డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్ లభించింది.

భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న రుతుక్రమ సమస్యల గురించి ఈ సినిమాలో చూపించారు. 25 నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీని ఉత్తరప్రదేశ్ లోని హపూర్ ప్రాంతంలో తెరకెక్కించారు. ఈ ప్రాంతానికి చెందిన మహిళలు బయోడీగ్రేడబుల్ న్యాప్కిన్లు ఎలా తయారుచేయాలో నేర్చుకుంటారు.

వాటిని ఇతర మహిళలకు తక్కువ ధరకు అమ్ముతూ ఎలా సహాయపడ్డారో అనేదే ఈ సినిమా. ఈ చిత్రానికి రేకా జెహ్ తాబ్చి దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు ఎన్నో భారతీయ చిత్రాలు ఆస్కార్ కి నామినేట్ అయినప్పటికీ.. అవార్డుల రాక చాలా సార్లు నిరాశనే ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇప్పుడు ఓ డాక్యుమెంటరీ సినిమాకి ఆస్కార్ రావడం ప్రతిష్టాత్మకంగా నిలిచింది.

ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టిన రోమా, గ్రీన్ బుక్ సినిమాలు!

ఆస్కార్ 2019: విజేతలు వీరే!

click me!