నాని 'గ్యాంగ్ లీడర్' కి ఫిక్స్!

Published : Feb 24, 2019, 06:27 PM IST
నాని 'గ్యాంగ్ లీడర్' కి ఫిక్స్!

సారాంశం

వరుస విజయాలతో దూకుడు మీదున్న హీరో నాని తాజాగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించనున్నాడు. 

వరుస విజయాలతో దూకుడు మీదున్న హీరో నాని తాజాగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించనున్నాడు. 

కథ ప్రకారం ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉంటారని టాక్. ఇప్పటికే మేఘా ఆకాష్, సాయి పల్లవి, ప్రియాంక ఆరుళ్ వంటి హీరోయిన్లను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో నాని నవలా రచయితగా కనిపిస్తాడని, అతడి క్యారెక్టర్ ప్లే బోయ్ తరహా ఉంటుందని అంటున్నారు.

అయితే ఈరోజు నాని పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ ని రివీల్ చేసింది చిత్రబృందం. అదే 'గ్యాంగ్ లీడర్'. నిన్నటి నుండే ఈ టైటిల్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు అదే టైటిల్ ని చిత్రయూనిట్ ఫైనల్ చేసింది. దీనికి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు.

చిరంజీవి సూపర్ హిట్ చిత్రాల్లో 'గ్యాంగ్ లీడర్' ఒకటి. గతంలో ఈ టైటిల్ వాడుకోవాలని రామ్ చరణ్, సాయి ధరం తేజ్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ నాని కొట్టేశాడు. ఆగస్ట్ లో రాబోతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?