తిత్లీ ఎఫెక్ట్: బాధితులకు జీవిత, రాజశేఖర్ పదిలక్షల సాయం!

Published : Oct 24, 2018, 11:01 AM IST
తిత్లీ ఎఫెక్ట్: బాధితులకు జీవిత, రాజశేఖర్ పదిలక్షల సాయం!

సారాంశం

తిత్లీ తుఫాను కారణంగా ఉత్తరాంధ్ర అల్లకల్లోలమైంది. శ్రీకాకుళం జిల్లాలోని 165 గ్రామాలు సమస్యల్లో చిక్కుకున్నాయి. ఆస్థి నష్టం ఎక్కువగా జరిగింది.  ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నా.. సినీ పరిశ్రమ కూడా బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది

తిత్లీ తుఫాను కారణంగా ఉత్తరాంధ్ర అల్లకల్లోలమైంది. శ్రీకాకుళం జిల్లాలోని 165 గ్రామాలు సమస్యల్లో చిక్కుకున్నాయి. ఆస్థి నష్టం ఎక్కువగా జరిగింది.  ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నా.. సినీ పరిశ్రమ కూడా బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది.

ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి తారలు ముఖ్యమంత్రి సహాయనిధికి తమ విరాళాలను అందించారు. తాజాగా జీవితా రాజశేఖర్ దంపతులు కూడా తిత్లీ తుఫాను బాధితులను ఆదుకోవడం కోసం తమ వంతు సాయంగా రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అమరావతిలో ఆయన స్వగృహంలో నేరుగా కలుసుకొని రూ.10 లక్షల చెక్ ను అందించారు. 

ఇవి కూడా చదవండి.. 

‘‘తిత్లీ’’ తుఫాను బాధితులకు అన్నదమ్ముల సాయం

 

PREV
click me!

Recommended Stories

Anasuya: వామ్మో దాని గురించి మాట్లాడితే మరో 10 రోజులు స్టఫ్‌ అయిపోతా.. శివాజీపై మరో విధంగా సెటైర్లు
Bigg Boss తర్వాత నా కళ్లు తెరుచుకున్నాయి.. సింగర్ గీతా మాధురి