విదేశాల్లో బంధువులు.. గొల్లపూడి అంత్యక్రియలకు అప్పటి వరకు ఆగాల్సిందే!

By tirumala ANFirst Published Dec 12, 2019, 5:01 PM IST
Highlights

ప్రముఖ సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు గురువారం రోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు.

ప్రముఖ సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు గురువారం రోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు. గొల్లపూడి మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని సినీ ప్రముఖులంతా సంతాపం తెలియజేస్తున్నారు. 

మారుతీరావు నటుడిగా, రచయితగా, దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు సేవలందించారు. విలక్షణమైన నటనతో ఎన్నో అద్భుతమైన పాత్రలని పోషించారు. ఆయన విలన్ రోల్స్ చేస్తే హాస్యం కూడా ఎక్కడా మిస్ కాదు. మారుతీరావు విభిన్న శైలిలో చెప్పే డైలాగులు తెలుగు ప్రేక్షకులని అలరించాయి. 

రత్నాన్ని కోల్పోయాం.. గొల్లపూడి మృతికి మహేష్ బాబు, అనుష్క సంతాపం!

మారుతీరావు భౌతిక కాయానికి ఆదివారం రోజు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆయన రెండో కుమారుడు రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు. 

గొల్లపూడి జీవితంలో విషాద ఘటన.. అజిత్ తో సినిమా తీస్తూ కుమారుడి మృతి

విదేశాల్లో ఉన్న బంధువులు, మిత్రులు రావాల్సి ఉంది. దీనితో గొల్లపూడి భౌతిక కాయాన్ని శనివారం రోజు మధ్యాహ్నం వరకు ఆసుపత్రిలోనే ఉంచుతారు. ఆ తర్వాత అభిమానుల సందర్శనార్థం గొల్లపూడి భౌతికకాయాన్ని ఆయన నివాసానికి తరలించనున్నట్లు రామకృష్ణ తెలిపారు. ఆదివారం రోజు మధ్యాహ్నం గొల్లపూడికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

గొల్లపూడి మృతి: మెగాస్టార్ సూపర్ హిట్ తో ఎంట్రీ.. ఆరు నందులు కైవసం!

గొల్లపూడికి ముగ్గురు కుమారులు సంతానం.  సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్ గొల్లపూడి ముగ్గురు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు శ్రీనివాస్ అజిత్ హీరోగా ప్రేమ పుస్తకం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ 1992లో ప్రమాదవశాత్తు మరణించాడు. 

 

click me!