'మెగా' మాయలో త్రివిక్రమ్.. కొన్నేళ్ల పాటు వారికే అంకితం!

Published : Jan 29, 2020, 09:42 AM IST
'మెగా' మాయలో త్రివిక్రమ్.. కొన్నేళ్ల పాటు వారికే అంకితం!

సారాంశం

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కమర్షియల్ చిత్రాలే తెరకెక్కిస్తారు. కానీ ఆయన చిత్రాలు మిగిలిన దర్శకులకు విభిన్నం. మాటలతో మాయ చేయడం, ఆకట్టుకునే ఎమోషన్స్, కొత్తగా అనిపించే యాక్షన్ ఎపిసోడ్స్ త్రివిక్రమ్ చిత్రాల్లో ఉండే ప్రత్యేకతలు. 

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కమర్షియల్ చిత్రాలే తెరకెక్కిస్తారు. కానీ ఆయన చిత్రాలు మిగిలిన దర్శకులకు విభిన్నం. మాటలతో మాయ చేయడం, ఆకట్టుకునే ఎమోషన్స్, కొత్తగా అనిపించే యాక్షన్ ఎపిసోడ్స్ త్రివిక్రమ్ చిత్రాల్లో ఉండే ప్రత్యేకతలు. 

ఈ సంక్రాంతికి త్రివిక్రమ్ మ్యాజిక్ మరోమారు పనిచేసింది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రం రెండు వారాల్లోనే బాక్సాఫీస్ వద్ద 140 కోట్లకు పైగా షేర్ కొల్లగొట్టింది. అల్లు అర్జున్ ఫెర్ఫామెన్స్, త్రివిక్రమ్ మ్యాజిక్ కు తమన్ సంగీతం తోడు కావడంతో ఈ అద్భుత విజయం సాధ్యమైంది. 

ఇదిలా ఉండగా త్రివిక్రమ్ తదుపరి చిత్రాలపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. వచ్చే రెండు మూడు ఏళ్ల పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగా కాంపౌండ్ కే అంకితం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఉండబోతోంది. ఈ ఏడాది ద్వితీయార్థంతో ఈ చిత్రం ప్రారంభం కానుంది. 

ఈ చిత్రం వరుసగా త్రివిక్రమ్ మూడు చిత్రాలు మెగా ఫ్యామిలీకే చేయబోతున్నారు. ఎన్టీఆర్ మూవీ తర్వాత రాంచరణ్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, హారిక అండ్ హాసిని సంస్థలు నిర్మించబోతున్నాయి. ఈ చిత్రం పూర్తయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవితో ఓ చిత్రం ఉంటుంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, హారిక అండ్ హాసిని నిర్మిస్తాయి. 

టాలీవుడ్ ఫ్లాప్ డైరెక్టర్స్ చేతుల్లో వందల కోట్లు.. వివరాలు ఇవే!

ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో మరో చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే త్రివిక్రమ్, బన్నీ మధ్య ప్రాథమిక చర్చ మొదలయింది. ఇలా త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి నాలుగు చిత్రాలు ఖరారైపోగా అందులో మూడు మెగా ఫ్యామిలీ హీరోలతోనే కావడం విశేషం. రాబోవు మూడు నాలుగు ఏళ్లలో త్రివిక్రమ్ బయటి హీరోలతో చేసే సినిమా ఎన్టీఆర్ దే అన్నమాట. 

రాజమౌళి సినిమాలో శ్రీయ.. ఆమె రోల్ ఇదేనా?

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?