సూపర్ స్టార్ కృష్ణ వెంటిలేటర్ పై ఉన్నాడని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకువచ్చారని వైద్యులు తెలిపారు.
హైదరాబాద్:సూపర్ స్టార్ కృష్ణకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యుడు ఎన్.రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై ఉన్నాడని వైద్యులు తెలిపారు. సోమవారంనాడు మధ్యాహ్నం కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు మీడియా సమావేశం నిర్వహించారు. సోమవారంనాడు తెల్లవారు జామున 2 గంటల కు హీరో కృష్ణను ఆసుపత్రికి తీసుకువచ్చినట్టుగా చెప్పారు.
ఐసీయూలో చికిత్స అందిస్తున్నామన్నారు.24 గంటలవరకు ఏమీ చెప్పలేమని డాక్టర్ రెడ్డి చెప్పారు.హీరో కృష్ణకు నిరంతరం వైద్య సేవలు అందిస్తన్నట్టుగా ఆయన వివరించారు. కార్డియాలజిస్టుల వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్టుగా డాక్టర్ రెడ్డి తెలిపారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందన్నారు.
alsoread:సూపర్ స్టార్ కృష్ణకు అస్వస్థత:ఆసుపత్రికి తరలింపు
ఆయన వెంటిలేటర్ పై ఉన్నారని డాక్టర్ రెడ్డి తెలిపారు.కృష్ణ కుటుంబ సభ్యులంతా ఆసుపత్రిలో ఉన్నారని డాక్టర్లు చెప్పారు. గంట గంటకు ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. ఆసుపత్రికి రాగానే కృష్ణకు వైద్య సేవలు అందించినట్టుగా డాక్టర్లు వివరించారు. కృష్ణ కుటుంబ సభ్యులకు తమ ఆసుపత్రితో చాలా కాలంగా అనుబంధం ఉందని డాక్టర్ రెడ్డి వివరించారు.
కృష్ణకు అందించాల్సిన చికిత్స ఇస్తున్నామన్నారు. అవసరమైన పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్టుగా ఆయన వివరించారు. ఆసుపత్రికి వచ్చిన మరుక్షణమే క్షణం ఆలస్యం చేయకుండా20 నిమిషాలు సీపీఆర్ చేసినట్టుగా డాక్టర్ రెడ్డి వివరించారు.సీపీఆర్ చేసిన తర్వాత ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు కృష్ణ హెల్త్ బులెటిన్ అందిస్తామని వైద్యలు తెలిపారు.
శరీరం సహకరించే దాన్ని బట్టి వైద్యం అందించనున్నట్టుగా డాక్టర్ చెప్పారు.ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి గుండెపోటుతో ఆయనకు స్పృహ కూడా లేదని డాక్టర్ రెడ్డి వివరించారు.ఆయన త్వరగా కోలుకోవాలని అందరం ప్రార్ధిద్దామని వైద్యులు కోరారు.ఇప్పటినుండి ప్రతి గంట కీలకమేనని ఆయన చెప్పారు. 48 గంటల వరకు ఏమౌతుందో చెప్పలేమన్నారు.