సూపర్ స్టార్ కృష్ణకు అస్వస్థత:ఆసుపత్రికి తరలింపు

Published : Nov 14, 2022, 10:37 AM ISTUpdated : Nov 14, 2022, 01:50 PM IST
 సూపర్ స్టార్ కృష్ణకు అస్వస్థత:ఆసుపత్రికి తరలింపు

సారాంశం

 టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ అస్వస్థతకు  గురయ్యారు.ఆయనను హైద్రాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్:సూపర్ స్టార్ కృష్ణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హైద్రాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. సోమవారంనాడు ఉదయం తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కృష్ణను ఆసుపత్రికి తరలించారు.
శ్వాస సంబంధ సమస్యలతో హీరో  కృష్ణ ఇబ్బందిపడుతున్నట్టుగా  వైద్యులు గుర్తించారు. ఈ విషయమై  చికిత్స కోసం కృష్ణను ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు . రెగ్యులర్ చెకప్ కోసమే  కృష్ణను ఆసుపత్రికి తరలించినట్టుగా ప్యామిలీ మెంబర్లు చెబుతున్నారు.సూపర్ స్టార్ ఆరోగ్య  పరిస్థితి నిలకడగా  ఉందని వైద్యులు చెబుతున్నారు. నిపుణులైన వైద్యులు  హీరో కృష్ణకు చికిత్స  అందిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున  కృష్ణను కుటుంబసభ్యులు కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. కృష్ణ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. 

ఈ ఏడాది సెప్టెంబర్ 28వ  తేదీన  కృష్ణ సతీమణి ఇందిరాదేవి మరణించారు. హీరో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతితో ఇందిరాదేవి మానసికంగా కుంగిపోయిందని చెబుతున్నారు.దీనికి తోడు అనారోగ్యంతో  ఇందిరా దేవి  మృతి చెందింది.2019లోనే  కృష్ణ మరో భార్య విజయనిర్మల మృతి చెందింది. ఈ ఏడాది జనవరి మాసంలో హీరో కృష్ణ పెద్దకొడుకు  రమేష్ బాబు మృతి   చెందాడు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?