
ఇప్పటికే పుష్ప సినిమా వచ్చి దాదాపు సంవత్సరం అయిపోతుంది. దీంతో పుష్ప 2 కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ ముహూర్తపు పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం లేటుగా మొదైలంది. సుకుమార్ ఈ రెండో పార్ట్‌ను మరింత హిట్ చేయాలని చెక్కుతూనే ఉండటమే కారణమని తెలిసింది. పుష్ప ఫస్ట్ పార్ట్ అనుకున్నదానికంటే ఎక్కువ హిట్ అవ్వడం, నార్త్‌లో విపరీతంగా డిమాండ్ రావడంతో ఈ సినిమాను మరో స్థాయిలో తెరకెక్కించాలని భావించి భారీగా ప్లాన్ చేసారు.
ఈ క్రమంలో ఎట్టకేలకు పుష్ప 2 సినిమా షూటింగ్ మొత్తానికి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది.అందు కోసం ఒక ప్రత్యేక సెట్ ఏర్పాటైంది. సినిమాలోని కీలక సన్నివేశాల్ని ఇందులో చిత్రీకరించనున్నారు. అల్లు అర్జున్ ఈ సన్నివేశాల్లో లేకపోవడంతో..అతడు హాజరు కాలేదు. డిసెంబర్ నుంచి బన్నీ షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ప్రభాస్ కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచిన బాహుబలి సెట్స్ వేసిన చోటే ఈ షూట్ జరుగుతోందని వినికిడి. దీంతో సెంటిమెంట్ కానూ ఈ సినిమాకు కలిసొస్తుందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ నేఫద్యంలో ఈ చిత్రం బిజినెస్ ఊపందుకుంది. ముఖ్యంగా పుష్ప సెకండ్ పార్ట్ కు ఓవర్సీస్ లో కూడా ఈసారి మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. ముఖ్యంగా అమెరికాలో కూడా పుష్ప భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. ఇక సెకండ్ పార్ట్ కు అక్కడ మంచి డిమాండ్ ఏర్పడింది. మైత్రి మూవీ మేకర్స్ కు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు క్లోజ్ కాబట్టి తీవ్రస్థాయిలో ఈ సినిమా హక్కుల కోసం పోటీపడుతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాలో యు ఎస్ థియేట్రికల్ రిలీజ్ కోసం కొందరు డిస్ట్రిబ్యూటర్లు దాదాపు 55 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే నిర్మాతలు మాత్రం 65 కోట్లకు కోట్ చేస్తున్నట్లు సమాచారం.. ఇక ఎలాగైనా ఈ డీల్ సెట్ చేసుకోవాలి అని డిస్ట్రిబ్యూటర్లు అయితే నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ”నాకు తెలుసు మీరంతా పుష్ప 2 అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. దాని గురించి ఒకటే మాట చెప్తాను పుష్ప 1 తగ్గేదేలే అయితే పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. సినిమా వేరే లెవెల్ ఉంటుంది. కచ్చితంగా అందరికి నచ్చుతుంది. చాలా పాజిటివ్ గా ఉంటుంది అని ఆశిస్తున్నాను” అని అన్నారు.