రియా జిత్తులమారి, ఆమె డ్రామాలు ఇవీ: సుశాంత్ ఫ్యామిలీ లాయర్

Published : Jul 30, 2020, 07:41 AM ISTUpdated : Jul 30, 2020, 07:50 AM IST
రియా జిత్తులమారి, ఆమె డ్రామాలు ఇవీ: సుశాంత్ ఫ్యామిలీ లాయర్

సారాంశం

ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై లాయర్ వికాస్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. రియా చక్రవర్తి సుశాంత్ ఆత్మహత్య తర్వాత డ్రామాలు ఆడిందని వికాస్ సింగ్ అన్నారు.

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై సంచనలమైన ఆరోపణలు వస్తున్నాయి. సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ రియా చక్రవర్తపై సంచలన ఆరోపణలు చేశారు. రియా జిత్తులమారి మనస్తత్వం కలిగిందని ఆయన వ్యాఖ్యానించారు 

స్వార్థ బుద్ధితో సుశాంత్ డబ్బును దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు ఏడాది పాటు దాదాపు రూ.15 కోట్ల రూపాయలను సుశాంత్ ఖాతా నుంచి దారి మళ్లించిందని ఆయన అన్నారు. తన నక్క బుద్ధి బయటపడకూడదని సుశాంత్ ఆత్మహత్య కేసును సిబిఐకి అప్పగించాలని కోరిందని, కేసు నుంచి దృష్టి మళ్లించడానికే ఆ విధమైన విజ్ఢప్తి చేసిందని ఆయన అన్నారు. 

Also Read: రియా చక్రవర్తిపై కేసు: సింబల్స్‌తోనే ఎక్స్‌ప్రెషన్స్... వైరలవుతున్న అంకిత పోస్ట్

నిజానికి రియా సిబిఐ దర్యాప్తును కోరుకోవడం లేదని, కేసును ముంబై పోలీసులు విచారించడమే ఆమెకు కావాల్సిందని వికాస్ సింగ్ అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం సుశాంత్ ఆత్మహత్య కేసును సిబిఐకి అప్పగించడానికి సిద్ధంగా లేదని ఆయన అన్నారు. 

సుశాంత్ సింగ్ కేసు విచారణను ముంబై పోలీసులకు అప్పగించాలని కోరుతూ రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్యపై ఆయన తండ్రి కేకే సింగ్ పాట్నాలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పాట్నా పోలీసులు కేసు దర్యాప్తును చేపట్టారు. 

Also Read: సుశాంత్ ఆత్మహత్య: రియా గురించి విస్తుపోయే విషయాలు ఇవీ...

రియాను ప్రశ్నించడానికి ముంబై వచ్చిన పాట్నా పోలీసులకు ఆమె టోకరా ఇచ్చింది. ఆమె ఇంట్లో కనిపించలేదు. ఆమె ఏడాది క్రితమే ఇల్లు ఖాళీ చేసినట్లు కూడా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?