సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ పై ఎఫ్ఐఆర్: ముందస్తు బెయిలుకు రియా చక్రవర్తి యత్నాలు

Published : Jul 29, 2020, 01:42 PM IST
సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ పై ఎఫ్ఐఆర్: ముందస్తు బెయిలుకు రియా చక్రవర్తి యత్నాలు

సారాంశం

కేసు ఫైల్ అయి ఎఫ్ఐఆర్ నమోదవడంతో రియా చక్రవర్తి మరికాసేపట్లో ముందస్తు బెయిలుకు దాఖలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ప్రకంపనలు సృష్టిస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తండ్రి సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై కేసు ఫైల్ చేయడంతో కేసు పూర్తిగా కొత్త మలుపు తిరిగింది. 

కేసు ఫైల్ అయి ఎఫ్ఐఆర్ నమోదవడంతో రియా చక్రవర్తి మరికాసేపట్లో ముందస్తు బెయిలుకు దాఖలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుతున్న సమాచారం మేరకు ఆమె లాయర్లు నిన్న రాత్రే ఒక ముసాయిదాను తయారుచేసారు. ఆమె రాత్రే వాటిపై సంతకాలు పెట్టినట్టుగా తెలుస్తుంది. 

రియా తరుఫున సతీష్ మనశిందే వాదించనున్నారు. గతంలో సంజయ్ దుత్త కేసును కూడా ఆయనే వాదించారు. తాజాగా జరిగిన పాల్గడ్ మూక దాడి కేసును కూడా ఆయన వాదించారు. 

నిన్న రాత్రి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తండ్రి కేకే సింగ్ తన తనయుడు సుశాంత్ సింగ్ మరణానికి రియాన్ కారణమని ఫిర్యాదు చేసారు. ఈ మేరకు రియా చక్రవర్తిపైన పాట్నాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రియాతో పాటు మరికొందరు స్నేహితులు మోసం, కుట్రకు పాల్పడటం ద్వారా తన కుమారుడి బలవన్మరణానికి కారణమయ్యారని కేకే సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు రియాతో పాటు మరో ఐదుగురిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

రియాపై దొంగతనా నుండి మోసం వరకు అనేక సెక్షన్ల కింద పోలీసులు కేసును నమోదు చేసారు. 

అంతేకాకుండా నలుగురు పోలీసులతో కూడిన ఓ ప్రత్యేక బృందాన్ని కేసు విచారణ నిమిత్తం ముంబైకి పంపారు. కాగా.. సుశాంత్ మరణించి ఇన్ని రోజులు కావొస్తున్నా.. ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నా సుశాంత్ కుటుంబం అంతగా స్పందించలేదు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?