శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్నా: శృతిహాసన్

Published : Feb 28, 2020, 02:34 PM IST
శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్నా: శృతిహాసన్

సారాంశం

సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉండే ఈ బ్యూటీ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో సన్నగా, బక్క పల్చగా అయిపోయిన శృతిని చూసి కొందరు విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

ఒకప్పుడు వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ శృతిహాసన్.. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కాస్త విరామం తీసుకున్న శృతి ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యారు.

ఇది ఇలా ఉండగా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉండే ఈ బ్యూటీ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో సన్నగా, బక్క పల్చగా అయిపోయిన శృతిని చూసి కొందరు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీంతో వారికి ఘాటుగా సమాధానమిస్తూ పోస్ట్ పెట్టింది శృతి.

అందంలో దొరసానే... రాజశేఖర్ తనయ క్లీవేజ్ సోగసులు!

ఇతరుల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం తనకు లేదని.. 'ఆమె ఒకప్పుడు లావుగా ఉండేది. ఇప్పుడు సన్నగా ఉంది' అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారని ఇది కరెక్ట్ కాదని అన్నారు. హార్మోన్ల సమస్య కారణంగా తరచూ శారీరకంగా, మానసికంగా తను ఇబ్బంది పడుతున్న విషయాన్ని వెల్లడించింది శృతి.

గత కొన్నేళ్లుగా ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో కష్టపడుతున్నానని.. అది అంత ఈజీ కాదని అన్నారు. శారీరక మార్పుల వెనుక కష్టం మాములుగా ఉండదని అన్నారు. ఇది తన జీవితమని తన ముఖమని.. ఒకరి స్థాయిని మరొకరు నిర్ణయించలేరని అన్నారు. గతంలో తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు చెప్పిన శృతి ఆ విషయాన్ని ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదని.. తనకు ఎలా జీవించాలనిపిస్తే అలా జీవిస్తానని చెప్పింది. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?