ఆర్టీసీ బస్సులో 'భీష్మ' సినిమా.. స్పందించిన కేటీఆర్!

By telugu news teamFirst Published Feb 28, 2020, 12:43 PM IST
Highlights

హైదరాబాద్ నుండి జిల్లాలకు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులోని టీవీలో ఈ సినిమాని ప్రదర్శిస్తుండగా ఓ ప్రయాణికుడు తన మొబైల్ లో చిత్రీకరించి ట్విట్టర్ ద్వారా ఆ చిత్ర బృందానికి పంపించాడు.

టాలీవుడ్ హీరో నితిన్ నటించిన నూతన చిత్రం 'భీష్మ'. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ దక్కించుకుంది. ఇప్పటికీ థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా పైరసీకి గురైందని తెలుస్తోంది.

హైదరాబాద్ నుండి జిల్లాలకు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులోని టీవీలో ఈ సినిమాని ప్రదర్శిస్తుండగా ఓ ప్రయాణికుడు తన మొబైల్ లో చిత్రీకరించి ట్విట్టర్ ద్వారా ఆ చిత్ర బృందానికి పంపించాడు. నటుడు నితిన్ ఈ విషయాన్ని ఫిల్మ్ ఛాంబర్ లోని పైరసీ వ్యతిరేక విభాగం దృష్టికి తీసుకెళ్లారు.

నితిన్ కోసం వస్తున్న మెగా హీరో.. క్రేజీ న్యూస్!

ఈ విభాగం ప్రతినిధులు గురువారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సినిమా ఈ నెల 21న విడుదల కాగా విడుదలైన నాలుగో రోజే ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారని.. ఇతర మాధ్యమాలు, సామాజిక వేదికల్లో విస్తరించకుండా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను కోరారు.

టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో పైరసీ చిత్రాలను ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ గురువారం ట్విట్టర్ లో రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కి సూచించారు. 'భీష్మ' చిత్రాన్ని ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారని ఆ చిత్రదర్శకుడు ట్విట్టర్ లో కేటీఆర్ కి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. మంత్రి పువ్వాడ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. 

click me!