క్రియేటివ్ డైరెక్టర్ న్యూ స్క్రిప్ట్ రెడీ!

prashanth musti   | Asianet News
Published : Feb 28, 2020, 01:06 PM IST
క్రియేటివ్ డైరెక్టర్ న్యూ స్క్రిప్ట్ రెడీ!

సారాంశం

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే - యుగానికి ఒక్కడు' వంటి బాక్స్ ఆఫీస్ సినిమాలు తీసిన డైరెక్టర్ శ్రీ రాఘవ సినిమా అంటే ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. అయితే గత కొంత కాలంగా శ్రీ రాఘవ వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. రీసెంట్ గా వచ్చిన NGK కూడా పెద్దగా వర్కౌట్ కాలేకపోయింది.

'7/G బృందావన కాలనీ - ఆడవారి మాటలకు అర్థాలే వేరులే - యుగానికి ఒక్కడు' వంటి బాక్స్ ఆఫీస్ సినిమాలు తీసిన డైరెక్టర్ శ్రీ రాఘవ సినిమా అంటే ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. అయితే గత కొంత కాలంగా శ్రీ రాఘవ వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. రీసెంట్ గా వచ్చిన NGK కూడా పెద్దగా వర్కౌట్ కాలేకపోయింది.

ఇక నెక్స్ట్ ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. తన బ్రదర్ ధనుష్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ పనులన్నీ పూర్తి చేసినట్లు ట్వీట్ చేసిన శ్రీ రాఘవ హీరో ఎవరనే విషయాన్నీ చెప్పలేదు. అయితే తమ్ముడు ధనుష్ ఈ స్థాయికి చేరుకున్నాడు అంటే అంతా అన్నయ్య సెల్వా రాఘవ సహకారమనే చెప్పాలి.  హీరోగా అతను పనికిరాడు అని ఎంత మంది చెప్పినా వినకుండా కాదల్ కొండెన్ తో అవకాశాన్ని ఇచ్చాడు. ఆ సినిమా హిట్టవ్వడంతో అనంతరం మరో రెండు సినిమాలు తమ్ముడితోనే చేసి హిట్స్ ఇచ్చాడు.

అయితే ధనుష్ రోజురోజుకి స్టార్ హీరోగా ఎదుగుతుంటే సెల్వా రాఘవన్ మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. రీసెంట్ గా తీసిన ఎన్జికె కూడా ప్లాప్ అవ్వడంతో సెల్వా రాఘవన్ తో చేయడానికి ఏ హీరో ఇంట్రెస్ట్ చూపడం లేదు.  ఫైనల్ గా అన్నయ్య ఋణం తీర్చుకునే అవకాశం వచ్చిందని ధనుష్ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్ ఈ ఇయర్ అన్నయతోనే చేయాలనీ ఫిక్స్ అయ్యాడట. అందుకోసం ఒక మంచి కథను సెట్ చేయమని సెల్వా రాఘవన్ కి చెప్పినట్లు సమాచారం.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?