'ముప్పావలా' పోస్టర్ పై పవన్ ఫ్యాన్స్ మండిపాటు.. వర్మ వివరణ!

By AN TeluguFirst Published Jan 17, 2020, 2:42 PM IST
Highlights

ఆ పోస్టర్ నిజమే అన్నట్టుగా...వర్మ పేరిట ఓ ట్వీట్ వైరల్ అయింది. ఆ ట్వీట్ లో ఏముందంటే... తన కొత్త సినిమాను ప్రకటిస్తుండటం తనకు చాలా సంతోషంగా ఉంది. తన తదుపరి చిత్రం 'ముప్పావలా' అంటూ ఓ పోస్టర్ షేర్ చేశారు. 

ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండే రామ్ గోపాల్ వర్మ మరోసారి సోషల్ మీడియా గోడకు ఎక్కారు. ఈ మధ్యన ఆయన తెరకెక్కించిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' చిత్రం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా వర్కవుట్ అయ్యిందా లేదా అనే సంగతి అటుంచితే... రాజకీయంగా ఈ సినిమాపై  జరిగిన రచ్చ మాత్రం అంతాఇంతా కాదు. ఈ నేపథ్యంలో, వర్మ నెక్స్ట్ మూవీ ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు.

టైటిల్  ఏమిటనే దానిపై గత కొద్ది రోజులుగా ఆసక్తి నెలకొంది. ఖచ్చితంగా మరో వివాదాస్పద అంశాన్నే వర్మ ఎంపిక చేసుకుంటాడని అందరూ నమ్ముతున్న టైమ్ లో ఓ పోస్టర్ అందరి దృష్టికీ వచ్చింది.

కంటతడి పెట్టిన హీరోయిన్.. కాళ్లపై పడ్డ ఆర్జీవీ

ఆ పోస్టర్ నిజమే అన్నట్టుగా...వర్మ పేరిట ఓ ట్వీట్ వైరల్ అయింది. ఆ ట్వీట్ లో ఏముందంటే... తన కొత్త సినిమాను ప్రకటిస్తుండటం తనకు చాలా సంతోషంగా ఉంది. తన తదుపరి చిత్రం 'ముప్పావలా' అంటూ ఓ పోస్టర్ షేర్ చేశారు. ఆ పోస్టర్, టైటిల్  జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెటకారం చేస్తున్న కథాంశంతో సినిమా వస్తున్నట్టు  చాలా క్లియర్ గా ఉంది. ఇది సెన్సేషన్ గా మారింది.

పవన్ ఫ్యాన్స్ అయితే ఓ రేంజిలో వర్మను తిట్టి పోస్తున్నారు.  అయితే ఈ పోస్టర్ వాస్తవానికి వర్మ షేర్ చేయలేదట. ఆయనకు అసలు అలాంటి ఆలోచన లేదట. ఎవరో ఆయన పేరున మార్ఫింగ్ చేసి వదిలారట. అంటే వర్మకే ఎవరో ట్వీట్ ట్విస్ట్ ఇచ్చారన్నమాట.

ఈ  విషయమై  రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఆ ట్వీట్ తనది కాదని ట్విట్టర్ ద్వారా తెలిపారు. మార్ఫింగ్ చేసిన ఇమేజ్ తో దాన్ని ఎవరో పోస్ట్ చేశారని... దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. కావాలనుకుంటే ఎవరైనా సరే తన ట్వీట్ హిస్టరీని చెక్ చేసుకోవచ్చని అన్నారు.


 

To whomsoever concerned the below is a doctored/morphed image and nothing to do with me ..If anyone wishes they can check my tweet history pic.twitter.com/Bd9SfDVAlY

— Ram Gopal Varma (@RGVzoomin)
click me!