ముక్కు అవినాష్ కి హీరో ఛాన్స్.. కానీ సుధీర్ ఉన్నాడని..!

Published : Jan 17, 2020, 02:13 PM IST
ముక్కు అవినాష్ కి హీరో ఛాన్స్.. కానీ సుధీర్ ఉన్నాడని..!

సారాంశం

హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన కమెడియన్లు ఎంతవరకు సక్సెస్ అయ్యారనే విషయాన్ని పక్కన పడితే.. హీరో అనే ఇమేజ్ కోసం తమవంతు కృషి చేస్తున్నారు. అలాంటి ఓ అవకాశం 'జబర్దస్త్' కమెడియన్ ముక్కు అవినాష్ కి వస్తే.. అతడు మాత్రం సుడిగాలి సుధీర్ కోసం తన ఆఫర్ ని వదులుకున్నట్లు తెలుస్తోంది.

బుల్లితెరపై 'జబర్దస్త్' కామెడీ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో కమెడియన్స్ అంతా ఆడియన్స్ ని ఎంతగానో నవ్విస్తుంటారు. ఇప్పటికే ఈ స్కిట్స్ ద్వారా పాపులర్ అయిన షకలక శంకర్, ధనాధన్ ధనరాజ్ వంటి కమెడియన్లు సినిమాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

రీసెంట్ గా సుడిగాలి సుధీర్ కూడా 'సాఫ్ట్ వేర్ సుధీర్' అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన కమెడియన్లు ఎంతవరకు సక్సెస్ అయ్యారనే విషయాన్ని పక్కన పడితే.. హీరో అనే ఇమేజ్ కోసం తమవంతు కృషి చేస్తున్నారు.

స్టేజ్ పై ఏడ్చేసిన రోజా.. వైరల్ అవుతోన్న వీడియో!

అలాంటి ఓ అవకాశం 'జబర్దస్త్' కమెడియన్ ముక్కు అవినాష్ కి వస్తే.. అతడు మాత్రం సుడిగాలి సుధీర్ కోసం తన ఆఫర్ ని వదులుకున్నట్లు తెలుస్తోంది. గెటప్ శీను, రాం ప్రసాద్, సుధీర్‌ల కాంబినేషన్‌లో 'త్రీ మంకీస్' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఓకే కావడానికి అసలు కారణం ముక్కు అవినాష్ అని చెప్పుకొచ్చాడు

కమెడియన్ రాం ప్రసాద్. మొదట ఈ సినిమా కథ అవినాష్ దగ్గరకి వెళ్లిందని.. కథ విన్న అతడు మొదట తనతో, గెటప్ శీనుతో కలిసి నటించాలని అనుకున్నాడని.. కానీ తరువాత తనకంటే సుధీర్ ని పెడితే ముగ్గురి కాంబినేషన్ బాగుంటుందని చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు.

స్వార్ధం లేకుండా అవినాష్ తనకు హీరో ఛాన్స్ వచ్చినా.. సుధీర్ కోసం వదులుకున్నాడని రాం ప్రసాద్ చెప్పుకొచ్చాడు. 'త్రీ మంకీస్' సినిమాతో ఆడియన్స్ ని నవ్వించడంతో ఏడిపిస్తామని చెప్పాడు రాం ప్రసాద్. సినిమాలో ముగ్గురి మధ్య ఎమోషనల్ జర్నీ ఉంటుందని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?