'రంగస్థలం'కి అందుకే అంత రేంజ్.. నాకిష్టమైన సినిమాలు ఆడలేదు: రవితేజ!

By tirumala ANFirst Published Jan 17, 2020, 2:24 PM IST
Highlights

మాస్ మహారాజ రవితేజ నటించిన నటించిన తాజా చిత్రం డిస్కో రాజా. గత ఏడాది డిసెంబర్ లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో కూడా నిలవలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సోలో రిలీజే బెటర్ అని రవితేజ భావించాడు.

మాస్ మహారాజ రవితేజ నటించిన నటించిన తాజా చిత్రం డిస్కో రాజా. గత ఏడాది డిసెంబర్ లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో కూడా నిలవలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సోలో రిలీజే బెటర్ అని రవితేజ భావించాడు. అందుకే డిస్కోరాజా చిత్రాన్ని జనవరి 24న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ కు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. 

ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి విభిన్నమైన చిత్రాన్ని తెరకెక్కించిన విఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో తమిళ క్రేజీ నటుడు బాబీ సింహా కీలక పాత్రలో నటిస్తున్నాడు. రవితేజ, విఐ ఆనంద్, బాబీ సింహా ముగ్గురూ కలసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 

ఈ ఇంటర్వ్యూలో భవిష్యత్తులో మంచి కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటించాలని ఉన్నట్లు రవితేజ తన కోరికని బయటపెట్టాడు. ఇప్పుడిప్పుడే జనాలు కమర్షియల్ చిత్రాలతో పాటు కంటెంట్ ఉన్న చిత్రాలని కూడా ఆదరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు కమర్షియల్ చిత్రాలకే ఆదరణ ఉంటోంది.. జనాలు అవే చూస్తున్నారు.. మనం కూడా అలాంటి చిత్రాల్లోనే నటించాలి అని అనుకునేవాడిని. 

RRR : ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ కంటెంట్, ఖర్చు!

మధ్యలో విక్రమార్కుడు, కిక్ లాంటి కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటించా. అవి కూడా కమర్షియల్ చిత్రాలే.. కానీ అందులో మంచి పాయింట్ ఉంది. అంతకు ముందు శంభో శివశంభో, నా ఆటోగ్రాఫ్, నేనింతే చిత్రాలు చేశా. కథ పరంగా నాకు చాలా ఇష్టమైన సినిమాలు అవి. కానీ ఆ చిత్రాలు ఆడలేదు. దీనితో జనాలు కమర్షియల్ చిత్రాలే ఆదరిస్తారనే ముద్ర నా మనసులో పడిపోయింది. 

ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి మారుతోంది. సినిమాలో ఎంతోకొంత వైవిధ్యం లేకపోతే ఆడియన్స్ కు కూడా నచ్చడం లేదు. కాబట్టి వైవిద్యభరితమైన చిత్రాలు చేసేందుకు ఇదే మంచి సమయం అని అనుకుంటున్నా. కొత్త దర్శకుడు మంచి కథలతో వస్తే సినిమాలు చేస్తా అని రవితేజ అన్నారు. అలాంటి సమయంలో డిస్కోరాజా కథ నా వద్దకు వచ్చిందని రవితేజ అన్నారు. 

కథ డిమాండ్ చేస్తే నెగిటివ్ షేడ్స్ లో కూడా నటించడానికి సిద్ధం అని రవితేజ అన్నారు. ఆ మధ్యన రంగస్థలం సినిమా వచ్చింది. అందులో కంటెంట్ ఉంది.. అలాగే కమర్షియాలిటీ కూడా ఉంది. అందుకే ఆ చిత్రం అంత రేంజ్ కు వెళ్ళింది. అలాంటి కథలతో రండి నేను చేస్తా అని రవితేజ అన్నారు. 

click me!