కమల్ కామెంట్స్ కి నిర్మాత ఘాటు కౌంటర్..!

By telugu news teamFirst Published Feb 27, 2020, 2:20 PM IST
Highlights

 ప్రమాదం జరిగిన వెంటనే నిర్మాత సుభాస్కరన్ స్పందించారు. లండన్ నుంచి చెన్నయికి హుటాహుటిన వచ్చి ... బాధిత కుటుంబాలను పరామర్శించారు. రెండు కోట్ల పరిహారం ఇచ్చారు. అంతవరకూ బాగానే ఉంది. 

భారతీయుడు-2(ఇండియన్ 2) చిత్రం షూటింగ్ లో జరిగిన ఘోర ప్రమాదం అందరిని షాక్ కి గురి చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు భారీ క్రేన్ విరిగిపడింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో హీరో కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ స్పాట్ లోనే ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ ప్రమాదంపై కమల్ హాసన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు స్నేహితులను కోల్పోయానని వాపోయారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున సాయం ప్రకటించారు.

Indian2:'ఆ క్రేన్ నా మీద పడున్నా బావుండేది'.. శంకర్ షాకింగ్ కామెంట్స్!

అలాగే ప్రమాదం జరిగిన వెంటనే నిర్మాత సుభాస్కరన్ స్పందించారు. లండన్ నుంచి చెన్నయికి హుటాహుటిన వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించారు. రెండు కోట్ల పరిహారం ఇచ్చారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ తన రాజకీయ లబ్ది కోసం నిర్మాతకి వ్యతిరేకంగా కామెంట్ చేశారు కమల్.

నిర్మాతలు కనీస జాగ్రత్తలు తీసుకోలేదు, సెట్ ని ఇలా కాదు మైంటైన్ చెయ్యడం, వారికీ బాధ్యత లేదు అనే అర్దం వచ్చేటట్లుగా మీడియాలో కామెంట్ చేశారు. కానీ అది బూమ్ రాంగ్ అయ్యి తిరిగి వచ్చి తనకే తగిలింది. కమల్ చేసిన ఈ కామెంట్స్  పై నిర్మాత స్పందించి ఘాటుగా సమాధానమిచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసారు.

ఆ ప్రకటన సారాంశం ఏమిటంటే...."కమల్ గారు మీరు స్పందించక ముందే మేము స్పందించాం. ఇక షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆన్ సెట్ లో సౌకర్యాలు, జాగ్రత్తలు ఏవి అవసరమో.. అవన్నీ తీసుకున్నాం. అయితే ఇక్కడో విషయం...సినిమా నిర్మాణం మాదే అయినా... సినిమాని మొత్తం నడిపిస్తోంది మీరు, దర్శకులు శంకరే. మీ ఇద్దరి సూపర్ విజన్ లో నే షూటింగ్ జరుగుతోంది. చివరకి సెట్ లో ఉండి అన్ని జాగ్రత్తలు చూసుకోవాలిసిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ని కూడా దర్శకుడు శంకర్ తాను చెప్పిన వ్యక్తిని నియమించాము,వారి నుంచి కూడా ఇంకా మాకు ఈ విషయమై ఇంకా రెస్పాన్స్ రావాల్సి ఉంది" అంటూ ఘాటుగా ఓ లెటర్ ని రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
 

click me!