హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు.. దర్శకుడి భార్య సంచలన కామెంట్స్!

Published : Feb 27, 2020, 12:07 PM IST
హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు.. దర్శకుడి భార్య సంచలన కామెంట్స్!

సారాంశం

రఘుబీర్, పూర్ణిమలకు 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. చాలా ఏళ్లుగా వీరిద్దరూ విడిపోయి ఉంటున్నారు. అయితే ఇటీవల పూర్ణిమ విడాకుల కోసం కోర్టుకెక్కారు. తన భర్త గురించి మీడియా ముందు ఆరోపణలు చేస్తున్నారు.

ప్రముఖ నటి నందితా దాస్ తో తన భర్త దర్శకుడు రఘుభీర్ దాస్ ఎఫైర్ పెట్టుకున్నాడని అతడి భార్య పూర్ణిమా ఖర్గా మీడియాకెక్కింది. తన భర్త ఎలాంటి వాడో చెబుతూ విడాకులు కోరింది. రఘుబీర్, పూర్ణిమలకు 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. చాలా ఏళ్లుగా వీరిద్దరూ విడిపోయి ఉంటున్నారు.

అశ్లీల వెబ్ సైట్ లో హీరోయిన్ ఫోన్ నంబర్.. అతడి పనే ఇది!

అయితే ఇటీవల పూర్ణిమ విడాకుల కోసం కోర్టుకెక్కారు. తన భర్త గురించి మీడియా ముందు ఆరోపణలు చేస్తున్నారు. పెళ్లైన ఏడేళ్లకే తమ కాపురంలో సమస్యలు వచ్చాయని.. ఓ సీరియల్ కోసం పని చేస్తున్నప్పుడు తన భర్త నందితా దాస్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. ఆ విషయంలో గొడవలు జరిగేవని.. రఘుబీర్ తనకు విడాకులిచ్చి నందితా దాస్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడని.. ఇంట్లో వారికి కూడా నందితా దాస్ ని పరిచయం చేశాడని.. కానీ ఆ తరువాత నందితా.. రఘుబీర్ ని వదిలేసిందని చెప్పారు.

రఘుబీర్ తో ఏ అమ్మాయి కలిసి ఉండలేదని నందితాకి చాలా మంది చెప్పారనే విషయాన్ని పూర్ణిమా తెలిపింది. ఆ తరువాత రఘుబీర్ నటుడు సంజయ్ మిశ్రా భార్యతో ఎఫైర్ పట్టుకున్నాడని.. ఆమె గర్భం కూడా దాల్చిందని.. అలాంటి వ్యక్తితో ఎలా కలిసుండగలనని పూర్ణిమ ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త నుండి విడాకులు కావాలని.. తన బిడ్డను చూసుకోవడానికి రఘుబీర్ పది కోట్ల భరణం చెల్లించాలని ఆమె కోరింది. 
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?