విజయ్ నెక్స్ట్ మూవీకి అదిరిపోయే కాన్సెప్ట్.. అతడి రోల్ ఇదేనా!

By tirumala ANFirst Published Dec 26, 2019, 3:25 PM IST
Highlights

ఇళయదళపతి విజయ్ క్రేజ్ రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతోంది. వరుస సూపర్ చిట్ చిత్రాలతో రజని తర్వాత అంతటి క్రేజ్ సొంతం చేసుకున్న హీరోగా విజయ్ దూసుకుపోతున్నాడు.

ఇళయదళపతి విజయ్ క్రేజ్ రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతోంది. వరుస సూపర్ చిట్ చిత్రాలతో రజని తర్వాత అంతటి క్రేజ్ సొంతం చేసుకున్న హీరోగా విజయ్ దూసుకుపోతున్నాడు. విజయ్ 64 వ చిత్రం ఇటీవలే ప్రాంభమైంది. ఈ చిత్రానికి సంబందించిన శక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

'ఖైదీ' ఫేమ్ లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో విజయ్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం విద్యార్థులని మానసిక ఒత్తిడికి గురిచేసేలా ఉన్న విద్యావ్యవస్థ తీరుని ఎండగట్టే విధంగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

పూరి జగన్నాధ్ కొడుకు పేరుతో అమ్మాయిలకి వల.. బయటపడ్డ చీటింగ్!

విద్యావ్యవస్థలో అవలంబిస్తున్న విధానాలు, జరుగుతున్న అవినీతిని వ్యతిరేకించే ప్రొఫెసర్ పాత్రలో విజయ్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో క్రేజీ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. ఇటీవల విజయ్ ఎక్కువగా సమాజానికి మంచి సందేశాన్ని అందించే చిత్రాల్లోనే నటిస్తున్నాడు. తుపాకి చిత్రంలో సైనికుల గొప్పతనాన్ని తెలియజేశాడు. కత్తి చిత్రంలో రైతుల సమస్యలని హైలైట్ చేసిన విజయ్.. మెర్సల్ మూవీలో వైద్యరంగంపై విమర్శనాస్త్రాలు సంధించాడు. 

'దూకుడు'పై నాకు డౌట్ ఉండేది.. ఎప్పుడూ చేయని పని చేశా.. శ్రీను వైట్ల!

విజయ్ నటించిన 3 ఇడియట్స్ రీమేక్ స్నేహితుడు చిత్రం కూడా విద్యావ్యవస్థకు సంబంధించినదే. ఇటీవల విడుదలైన శివకార్తికేయన్ చిత్రం 'హీరో' కూడా విద్యారంగానికి సంబంధించినదే. ఈ చిత్రంలో 'విద్యార్థుల నోట్ బుక్స్ కన్నా.. వారి రఫ్ నోట్ బుక్స్ చూడండి.. అప్పుడే వారి ఆలోచనలు, ప్రతిభ' అర్థం అవుతాయి అనే చక్కటి సందేశంతో హీరో చిత్రం తెరకెక్కింది. 

2019లో అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ సాధించిన చిత్రాలు.. 'సైరా' కళ్ళు చెదిరే రికార్డ్

 

click me!