Ravi Teja66: రీమేక్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

Published : Nov 07, 2019, 09:07 AM ISTUpdated : Nov 07, 2019, 09:10 AM IST
Ravi Teja66: రీమేక్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

సారాంశం

మాస్ రాజా రవితేజ నెక్స్ట్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్నాడు. డాన్ శీను - బలుపు వంటి బాక్స్ ఆఫీస్ హిట్ అనంతరం వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో మాస్ రాజా అభిమానుల్లో అంచనాల డోస్ పెరిగింది. అయితే ఆ సినిమా తమిళ్ సినిమాకు రీమేక్ అనే టాక్ వచ్చింది.

ప్రస్తుతం డిస్కోరాజా సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న మాస్ రాజా రవితేజ నెక్స్ట్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్నాడు. డాన్ శీను - బలుపు వంటి బాక్స్ ఆఫీస్ హిట్ అనంతరం వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో మాస్ రాజా అభిమానుల్లో అంచనాల డోస్ పెరిగింది

అయితే ఆ సినిమా తమిళ్ సినిమాకు రీమేక్ అనే టాక్ వచ్చింది.  గతంలోనే రవితేజ తేరి రీమేక్ చేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు సినిమా ఫైనల్ అయ్యిందని టాక్ వచ్చినప్పటికి ఎందుకో సెట్ కాలేదు. ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమా విజయ్ 'తేరి' రీమేక్ అని రూమర్స్ వచ్చాయి.

Read also: డిజాస్టర్ల ఎఫెక్ట్.. హీరోలను బతిమాలుతున్న సీనియర్ డైరెక్టర్లు

ఇక ఆ రూమర్స్ డోస్ పెరగకముందే దర్శకుడు గోపి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. రవితేజతో చేయబోతున్న సినిమా ఏ సినిమాకు రీమేక్ కాదని ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ కూడా చెప్పాడు.  రెండు తెలుగు రాష్ట్రాలకు సంబందించిన రియల్ ఇన్సిడెంట్స్ ని ఆధారాంగా చేసుకొని సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాధానం ఇచ్చాడు. కొన్నిళ్ళ క్రితం జరిగిన సంఘటనలు సినిమా కథలో మెయిన్ పాయింట్ అని తెలుస్తోంది.

మొత్తానికి దర్శకుడు ఒక క్లారిటి ఇవ్వడంతో రవితేజ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. ఇక డిస్కోరాజా సినిమా పనులన్నీ ముగిసిన తరువాత రవితేజ గోపిచంద్ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ స్పీడ్ పెరగనుంది. మరి మూడవసారి కలిసిన ఈ కాంబినేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?