నితిన్ కి కాబోయే భార్య.. ఫోటో లీక్!

By AN Telugu  |  First Published Feb 14, 2020, 9:55 AM IST

కుటుంబ సభ్యులు బలవంత పెడుతున్నా నితిన్ మ్యారేజ్ ని వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఫైనల్ గా నితిన్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. నితిన్ పెళ్లికి ముహూర్తం కుదిరింది. ఏప్రిల్ 16న నితిన్ వివాహం షాలిని అనే యువతితో జరగబోతోంది. 


టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడైన నితిన్ పెళ్లి గురించి గత కొన్నేళ్లుగా చర్చ సాగుతోంది. కుటుంబ సభ్యులు బలవంత పెడుతున్నా నితిన్ మ్యారేజ్ ని వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఫైనల్ గా నితిన్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు.

నితిన్ పెళ్లికి ముహూర్తం కుదిరింది. ఏప్రిల్ 16న నితిన్ వివాహం షాలిని అనే యువతితో జరగబోతోంది. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన షాలినితో నితిన్ నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వీరి ప్రేమని ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో పెళ్లిపీటలెక్కబోతున్నారు. 

Latest Videos

undefined

నితిన్ పెళ్లి వాయిదా వేయబోతున్నాడా..?

ముందుగా వీరిద్దరికీ నిశ్చితార్ధం జరిపించడానికి వెన్యూ, డేట్ ఫిక్స్ చేశారు. రేపే హైదరాబాద్ లో నితిన్ ఇంట్లో గ్రాండ్ గా నిశ్చితార్ధం జరిపించనున్నారు. ఇప్పటివరకు నితిన్ కి కాబోయే భార్య ఫోటోలు బయటకి రాలేదు. తాజాగా ఒక ఫోటో బయటకి వచ్చింది. ఆ ఫోటోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

మరోపక్క నితిన్ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నితిన్ సోదరి నిఖితా రెడ్డి దగ్గరుండి పెళ్లి పనులన్నీ చూసుకుంటున్నారు. ఏప్రిల్ 16న దుబాయ్ లో జరగనున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు కొద్దిమంది మాత్రమే అతిథులు హాజరు కానున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. 2018లో 'శ్రీనివాస కళ్యాణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ ప్రస్తుతం 'భీష్మ' అనే సినిమాలో నటిస్తున్నాడు. వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

click me!