'వరల్డ్ ఫేమస్ లవర్' ట్విట్టర్ రివ్యూ!

Published : Feb 14, 2020, 07:39 AM IST
'వరల్డ్ ఫేమస్ లవర్' ట్విట్టర్ రివ్యూ!

సారాంశం

శుక్రవారం నాడు వాలంటైన్స్ డే కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అమెరికా లాంటి దేశాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించడంతో సినిమా టాక్ బయటకి వచ్చింది.

'డియర్ కామ్రేడ్' లాంటి డిజాస్టర్ తరువాత విజయ్ దేవరకొండ నటించిన సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ సినిమాపై విజయ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు.

గోపీ సుందర్ సంగీతం సమకూర్చగా.. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం నాడు వాలంటైన్స్ డే కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అమెరికా లాంటి దేశాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించడంతో సినిమా టాక్ బయటకి వచ్చింది.

'వరల్డ్ ఫేమస్ లవర్' ప్రీమియర్ షో టాక్

సినిమా ఫస్ట్ హాఫ్ బావుందని కొందరు అంటుంటే.. పరవాలేదని మరికొందరు అంటున్నారు. విజయ్ దేవరకొండ నటన బాగుందని.. నలుగురు హీరోయిన్లు అధ్బుతంగా నటించారని కొనియాడుతున్నారు. అయితే కథలో మరో కథ అనే కాన్సెప్ట్ జనాలు జీర్ణించుకోవడం కష్టమని అంటున్నారు.

డైరెక్టర్ బ్రిలియంట్ కథ రాసుకున్నప్పటికీ దాన్ని తెరపై సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడని చెబుతున్నారు. క్యారెక్టర్ల డిజైన్ బాగుంది కానీ దాన్ని థియేటర్లో ప్రేక్షకులు ఎంతవరకు అర్ధం చేసుకుంటారో చెప్పడం కష్టమని అంటున్నారు.

సినిమా అయితే బాగుంది కానీ మరీ ఎంజాయ్ చేసే విధంగా లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ సినిమా ట్విట్టర్ నుండి మిశ్రమ స్పందన వస్తోంది. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?