RRR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. స్పీడ్ పెంచిన జక్కన్న!

prashanth musti   | Asianet News
Published : Feb 14, 2020, 08:50 AM ISTUpdated : Feb 14, 2020, 08:59 AM IST
RRR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. స్పీడ్ పెంచిన జక్కన్న!

సారాంశం

RRR కోసం సినీ ప్రేమికులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మూవీ అనుకున్న సమయానికి వస్తుందని చిత్ర యూనిట్ చెప్పిన మాటలపై అభిమానులు పెట్టుకున్న నమ్మకాలూ గాలిలో కలిసిపోయాయి.  

బిగ్ బడ్జెట్ మూవీ RRR కోసం సినీ ప్రేమికులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మూవీ అనుకున్న సమయానికి వస్తుందని చిత్ర యూనిట్ చెప్పిన మాటలపై అభిమానులు పెట్టుకున్న నమ్మకాలూ గాలిలో కలిసిపోయాయి.  వచ్చే ఏడాది జనవరిలో సినిమా వస్తుందని చెబుతున్నప్పటికీ ఆడియెన్స్ లో నమ్మకం కలగడం లేదు. చిత్ర దర్శకుడు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా సినిమా అప్డేట్ ని ఇవ్వమని ట్రోల్ చేస్తున్నారు.

రాజమౌళి బయటకనిపిస్తే అభిమానులు వదిలేలా లేరు. చాలా ఆగ్రహంతో ఉన్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ని చుస్తే అర్ధమవుతోంది. అందుకే సినిమాకు సంబందించిన అప్డేట్స్ మెగా నందమూరి అభిమానులను కూల్ చేయాలనీ  చిత్ర యూనిట్ ప్రణాళికలు రచిస్తోంది. సినిమాకు సంబందించిన మరొక గాసిప్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.

హీరోల పుట్టినరోజు సందర్బంగా మార్చ్ 27న అలాగే మే 20న..  రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ పాత్రలకు సంబందించిన పోస్టర్స్ ని రిలీజ్ చేయాలనీ జక్కన్న టీమ్ నిర్ణయించినట్లు టాక్. జక్కన్న ఆ విషయంలో వర్క్ స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. మారీ ఆ లుక్ అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇకపోతే సినిమాలో హాట్ బ్యూటీ హంసనందిని కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటికి ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు లేవు. కేవలం ఐటెమ్ సాంగ్స్ తో కాలాన్ని నెట్టుకొస్తోంది.

అయితే సోషల్ మీడియాలో హంసకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె పోస్ట్ చేసే హాట్ ఫోటోలు నిమిషాల్లో వైరల్ అవుతుంటాయి. ఇక ఆఫర్స్ లేవనుకుంటున్న సమయంలో RRRలో కనిపించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇది నిజమైతే బేబీ బ్యాడ్ లక్ బద్దలైనట్లే అని చెప్పవచ్చు. మరీ ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరీకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?