
సినిమా ప్రేమికులకు హైదరాబాద్‌లో ఇష్టపడే థియేటర్స్ లో మొదటగా చెప్పుకోవాల్సింది ప్రసాద్ ఐమాక్స్. ఈ థియోటర్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే హైదరాబాద్ వచ్చిన వాళ్లు ఖచ్చితంగా చూసే ఎట్రాక్షన్స్ లో ఒకటి ఐమాక్స్. ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఐమ్యాక్స్ థియేటర్. దీని స్క్రీన్ 72 అడుగుల ఎత్తు, 95 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ ధియేటర్ 12,000 వాట్ సౌండ్ సిస్టంతో 635 సీట్లను కలిగి ఉంటుంది. అతిపెద్ద ఐమాక్స్ తెరతో ఉన్న సిడ్నీ ఐమ్యాక్స్ థియేటర్ (123 x 97 అడుగులు) తో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ 3D స్క్రీన్. ఇక నుంచి ఐమాక్స్ ఎక్సపీరియన్స్ అందుబాటులో ఉండదు. ఐమాక్స్ ఫార్మాట్‌లో అతిపెద్ద స్క్రీన్ మీద సినిమాలను మొట్టమొదటి ఐమాక్స్ స్క్రీన్ ప్రసాద్స్ మల్టిప్లెక్సే. కానీ.. ఇక నుంచి అక్కడ ఐమాక్స్ ఫార్మాట్ ఉండదు.
అందుకు కారణం ఈ మల్టిప్లెక్స్‌లో ఇక ఐమాక్స్ ఫార్మాట్‌లో సినిమాలను ప్రదర్శించరు . ఐమాక్స్ ప్రొడక్షన్ టెక్నాలిజీ వాడటం ఆపేస్తున్నారు. అందుకు కారణం ఫిల్మింగ్ ప్రాసెస్,కంటెంట్ డెలవరీ మొత్తం డిజిటలైజేషన్ అవటమే. ఐమాక్స్ అనలాగ్ ప్రొజెక్టర్ ద్వారా ఇదివరకు ప్రసాద్ మల్టిప్లెక్స్‌లో ఐమాక్స్ ప్రింట్(రీల్)ను ప్రొజెక్ట్ చేసి సినిమాను ప్రదర్శించేవారు. ఇప్పుడది సాధ్యం కాదు. దాంతో ఐమాక్స్ ని ఆపేసారని, ఈ మేరకు డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక ఐమాక్స్ ప్రొజక్షన్స్ ప్రసాద్స్ లో ఉండదు. దాంతో ఇక నుంచి దాన్ని ఐమాక్స్ అని పిలవలేం. ప్రసాద్స్ మల్టిప్లెక్స్ అనే పిలవాల్సి ఉంటుంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం మారుతున్న కొత్త జనరేషన్ కు తగినట్లుగా ప్రసాద్స్ మల్టిప్లెక్స్‌ను సరికొత్తగా తీర్చిదిద్దారు. ఐమాక్స్ స్క్రీన్ లేకున్నా.. ఇతర లార్జ్ స్క్రీన్ల మీద లేటెస్ట్ సినిమాలను ప్రదర్శిస్తున్నారు. తెలుగు సినిమాల నుంచి హాలీవుడ్ చిత్రాల వరకు ఏదైనా ఇక్కడ విడుదల అవుతున్నాయి. ఇన్ని మల్టిప్లెక్స్ లు వచ్చినా ఇప్పటికీ ఎక్కువ మంది సినీ ప్రియులు ఈ థియేటర్‌లో సినిమా చూడడానికి ఎగబడుతున్నారు. ఐమాక్స్ పాపులారిటీ అలాగే ఉంది.