మెగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ పై అల్లు అర్జున్ కామెంట్స్!

Published : Jan 08, 2020, 06:44 PM ISTUpdated : Jan 08, 2020, 07:13 PM IST
మెగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ పై అల్లు అర్జున్ కామెంట్స్!

సారాంశం

అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ చిత్రాలు సంక్రాంతికి సందడి చేయబోతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల ప్రచార కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. అల్లు అర్జున్ తొలిసారి నేషనల్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. పలు జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. 

అల్లు అర్జున్ ఇంటర్వ్యూలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా నేపోటిజం గురించి అడిగిన ప్రశ్నలకు అల్లు అర్జున్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. మీరు కూడా సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచే వచ్చారు కదా అనే ప్రశ్న అల్లు అర్జున్ కు ఎదురైంది. 

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. చిరంజీవి గారు గ్రేట్ డాన్సర్.. ఆయన కొడుకుగా రాంచరణ్ కూడా అదే తరహాలో డాన్స్ చేస్తే అభిమానులకు నచ్చుతుంది. బ్రూస్ లీ కొడుకు ఫైట్స్ బాగా చేస్తే.. వాళ్ళ నాన్న లాగే చేస్తున్నాడని అంటారు. దానిని కొంతమని నేపోటిజం అని అంటారు. 

హిట్ డైరెక్టర్లతోనే సినిమా.. యాంకర్ పై మహేష్ బాబు సీరియస్!

మా నాన్న ప్రొడ్యూసర్.. కాబట్టి ఈజీగా, త్వరగా సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. కానీ 15 ఏళ్ల పాటు ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తోనే సక్సెస్ ఫుల్ గా కొనసాగలేం అని అల్లు అర్జున్ తెలిపాడు. చిరంజీవి గారు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చారు. ఇప్పటికి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లో వస్తున్నవారు.. వచ్చినవారు ఉన్నారు. అలాంటి వాళ్లంటే తనకు గౌరవం ఉంటుందని అల్లు అర్జున్ తెలిపాడు. 

ఎన్టీఆర్ మూవీకి ఒప్పుకుంది అందుకే.. 'దర్బార్'లో హైలైట్ అదే: నివేత

ఇక అర్జున్ రెడ్డి చిత్రం నాకు నచ్చింది. కానీ అలాంటి బోల్డ్ రోల్స్ తాను చేయనేమో అని అల్లు అర్జున్ తెలిపాడు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?